టోక్యో (Tokyo) వేదికగా జరుగుతున్న పారాలంపిక్స్ 2020లో (Paralympics) భారత అథ్లెట్ల (India Para Athletes) పతకాల వేట కొనసాగుతున్నది. తాజాగా శుక్రవారం జరిగిన హై జంప్ పోటీల్లో వరల్డ్ నెంబర్ 3 ప్రవీణ్ కుమార్ పతకం సాధించాడు. హైజంప్ టీ64 కేటగిరీలో 2.07 మీటర్ల ఎత్తు దూకి రజత పతకం సాధించాడు. ప్రవీణ్ సాధించిన ఈ పతకంతో భారత పతకాల సంఖ్య 11కు చేరింది. వరల్డ్ నెంబర్ 3 ప్రవీణ్ శుక్రవారం 2.07 మీటర్లు దూకి సరికొత్త ఏసియా రికార్డు సృష్టించాడు. కేవలం 2 సెంటీ మీటర్ల తేడాతో ప్రవీణ్ స్వర్ణ పతకం కోల్పోయాడు. బ్రిటన్‌కు చెందిన జోనాథాన్ బ్రూమ్ ఎడ్వర్డ్స్ 2.10 మీటర్ల ఎత్తు దూకి స్వర్ణ పతకం సాధించాడు. పారాలింపిక్స్ క్వాలిఫికేషన్స్ కొరకు జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో ప్రవీణ్ కుమార్ 1.92 మీటర్లు దూకి నాలుగో స్థానంలో నిలిచాడు. అప్పటి వరకు అదే అతడి అత్యుత్తమ ప్రదర్శన. కానీ పారాలింపిక్స్‌లో ఏకంగా 2.07 మీటర్లు దూకి రజతాన్ని గెలుచుకోవడం గమనార్హం.
Absolutely stellar performance by Praveen Kumar to win ? for #IND at #Tokyo2020 #Paralympics
With confidence and determination Praveen takes India's ? tally to
1️⃣1️⃣
Praveen also set a new Asian Record with the jump of 2.07m?
?? is extremley proud of you!#Cheer4India pic.twitter.com/uQBJgaGUK1
— SAI Media (@Media_SAI) September 3, 2021
భారత అథ్లెట్లు సాధించిన పతకాలు..
అవని లేఖర: స్వర్ణ పతకం - మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ - ఎస్‌హెచ్1
సుమిత్ అంటిల్ : స్వర్ణ పతకం - పురుషుల జావెలిన్ త్రో - ఎఫ్64
యోగేశ్ కథూనియా : రజత పతకం - పురుషుల డిస్కస్ త్రో - ఎఫ్56
నిషాద్ కుమార్ : రజత పతకం - పురుషుల హై జంప్ - టీ47
మరియప్పన్ తంగవేలు : రజత పతకం - పురుషుల హైజంప్ - టీ63
దేవేంద్ర : రజత పతకం - పురుషుల జావెలిన్ త్రో - ఎఫ్46
భవానీబెన్ పటేల్ : రజత పతకం - మహిళల టేబుల్స్ టెన్నిస్ - క్లాస్ 4
శరద్ కుమార్ : కాంస్య పతకం - పురుషుల హైజంప్ - టీ63
సుందర్ సింగ్ గుర్జార్ : కాంస్య పతకం - పురుషుల జావెలిన్ త్రో - ఎఫ్46
సింగ్‌రాజ్ అధాన : కాంస్య పతకం - పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ - ఎస్‌హెచ్ 1
ప్రవీణ్ కుమార్ : రజత పతకం - పురుషుల హై జంప్ - టీ64
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics