పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఆదివారం ఉదయం భవానీ పటేల్ టేబుల్ టెన్నిస్‌లో రజత పతకం సాధించింది. భారత పారా అథ్లెట్లు తొలి పతకం గెలిచి గంటలు గడవక ముందే పురుషుల హై జంప్ టీ47 పోటీల్లో నిషాద్ కుమార్ 2.06 మీటర్లు ఎత్తు దూకి రెండో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి నిషాద్ కుమార్‌తో పాటు రామ్ పాల్ ఫైనల్స్‌కు చేరారు. అయితే రాంపాల్ మూడు సార్లు కూడా 1.98 మీటర్లను దాటలేకపోయాడు. ఫైనల్స్‌లో అతడు కేవలం 1.94 మీటర్ల ఎత్తు మాత్రమే దూకాడు. అయితే నిషాద్ కుమార్ తొలి ప్రయత్నంలో 2.02 మీటర్లు దూకాడు. ఆ తర్వాత 2.06 మీటర్ల ఎత్తు దూకాడు. కానీ అంతకు మించి దూకలేక పోయాడు. ఇది ఆసియాలో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన చేసిన పారా అథ్లెట్‌గా నిషాద్ కుమార్ రికార్డు సృష్టించాడు. అమెరికాకు చెందిన టౌన్సెండ్ రోడ్రిక్ 2.15 మీటర్ల ఎత్తు దూకి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన నిషాద్ కుమార్ రజతం గెలుచుకున్నాడు. భారత పారా అథ్లెట్లు ఓకే రోజు రెండు రజత పతకాలు సాధించారు.
More joyful news comes from Tokyo! Absolutely delighted that Nishad Kumar wins the Silver medal in Men’s High Jump T47. He is a remarkable athlete with outstanding skills and tenacity. Congratulations to him. #Paralympics
— Narendra Modi (@narendramodi) August 29, 2021
పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో రజత పతకం అందించిన నిషాద్ కుమార్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. అతను హైజంప్ పోటీల్లో రజతం సాధించడం చాలా సంతోషంగా ఉంది. అద్బుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన అతడికి నా శుభాకాంక్షలు అని మోడీ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics