Home /News /sports /

INDIAN MENS HOCKEY TEAM RODE ON A BLISTERING ATTACK TO BEAT HOSTS SOUTH AFRICA 10 2 IN THEIR SECOND MATCH AT THE FIH HOCKEY PRO LEAGUE SRD SJN

Hockey Pro League : వారెవ్వా... ఏం ఆడారు! ద‌క్షిణాఫ్రికాపై భార‌త్ గోల్స్ వ‌ర్షం..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Hockey Pro League : టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన‌ప్ప‌టి నుంచి త‌గ్గేదే లే అన్న‌ట్లు మైదానంలో భార‌త హాకీ జ‌ట్టు ఆట సాగుతోంది. ప్రత్యర్థి ఎవరైనా సరే దుమ్మురేపే ఆటతో అలరిస్తోంది.

    అంత‌ర్జాతీయ హాకీ స‌మాఖ్య (FIH) హాకీ ప్రొ లీగ్ (Hockey Pro League)లో భార‌త పురుషుల హాకీ జ‌ట్టు (Indian Hockey Team) అద‌ర‌గొడుతుంది. టోక్యో ఒలింపిక్స్‌ (Tokyo Olympics bronze medalist)లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన‌ప్ప‌టి నుంచి త‌గ్గేదే లే అన్న‌ట్లు మైదానంలో భార‌త హాకీ జ‌ట్టు ఆట సాగుతోంది. మొన్న జ‌రిగిన‌ ప్రొ లీగ్ తొలి మ్యాచ్‌లో 5-0తో ఫ్రాన్స్‌ (France)ను చిత్తు చేసిన భార‌త్‌... తాజాగా ద‌క్షిణాఫ్రికా (South Africa)పై పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. ఈ మ్యాచ్‌లో భార‌త ఆట‌గాళ్లు ప్ర‌త్య‌ర్థి గోల్ పోస్ట్‌పై గోల్స్ వ‌ర్షం కురిపించారు. ఈ మ్యాచ్‌లో భార‌త్ 10-2 గోల్స్ తేడాతో ఆతిథ్య‌ ద‌క్షిణాఫ్రికాపై ఘ‌న‌విజయం సాధించింది. కెరీర్‌లో రెండో మ్యాచ్ ఆడుతున్న భార‌త డ్రాగ్ ఫ్లిక‌ర్ జుగ్‌రాజ్ సింగ్ (Jugraj singh) హ్యాట్రిక్ గోల్స్‌తో చెల‌రేగాడు. అత‌డు 4వ‌, 6వ‌, 23వ నిమిషంలో మూడు గోల్స్ చేసి కెరీర్‌లో తొలి హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు.

    గుర్సాహిబ్జిత్ సింగ్ (24వ‌, 36వ నిమిషాల్లో), దిల్‌ప్రీత్ సింగ్ (25వ‌, 58వ నిమిషాల్లో) చెరో రెండు గోల్స్ చేయ‌గా... హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్ (2వ నిమిషంలో), అభిషేక్ (12వ నిమిషంలో), మ‌న్‌దీప్ సింగ్ (27వ నిమిషంలో) ఒక్కో గోల్ చేసి భార‌త్ గెలుపులో త‌మ వంతు పాత్ర పోషించారు. ద‌క్షిణాఫ్రికా త‌ర‌ఫున న‌మోదైన రెండు గోల్స్‌ను డానియోల్ బెల్ (44వ నిమిషంలో), రిచ‌ర్డ్ పౌట్జ్ (45వ నిమిషంలో) వేశారు.

    ఆరంభం నుంచే దూకుడు...

    మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను చిత్తు చేసిన భార‌త్... ఈ మ్యాచ్‌లోనూ అదే దూకుడును ప్ర‌ద‌ర్శించింది. ఆరంభం నుంచే బంతిని త‌మ నియంత్ర‌ణ‌లో ఉంచుకుంటూ ప్ర‌త్య‌ర్థిపై పైచేయి సాధించింది. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ద‌క్షిణాఫ్రికా ర‌క్ష‌ణ‌శ్రేణిని ఛేదిస్తూ గోల్ పోస్ట్‌పై విరుచుకుప‌డింది.








    View this post on Instagram






    A post shared by Hockey India (@hockeyindia)





    ఈ క్ర‌మంలో వైస్ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ భార‌త్‌కు తొలి గోల్‌ను అందించాడు. ఇక తొలి క్వార్ట‌ర్‌లో మ‌రో మూడు గోల్స్ సాధించి ఆ క్వార్ట‌ర్‌ను 4-0తో ముగించింది. ఈ క్ర‌మంలో జుగ్‌రాజ్ సింగ్ 23వ నిమిషంలో గోల్ సాధించి హ్యాట్రిక్‌ను పూర్తి చేసుకున్నాడు. అయితే చివ‌ర్లో ద‌క్షిణాఫ్రికా నిమిషం వ్య‌వ‌ధిలో రెండు గోల్స్ చేసి భార‌త్ ఆధిక్యాన్ని కొంచెం త‌గ్గించ‌గ‌లిగింది. హ్య‌ట్రిక్‌తో మెరిసిన జుగ్‌రాజ్ ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. భార‌త్ త‌న త‌దుప‌రి మ్యాచ్‌ను ఈ నెల 12న ఫ్రాన్స్‌తో ఆడ‌నుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Hockey, India vs South Africa, Team India, Tokyo Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు