Home /News /sports /

INDIAN HOCKEY TEAM MARK A BIG WIN AGAINST INDONESIA AT THE HERO ASIA CUP 2022 TO QUALIFY FOR THE SUPER 4S WITH 16 0 GOALS SRD

Asia Cup Hockey: డూ ఆర్ డై ఫైట్ లో భారత హాకీ జట్టు నయా చరిత్ర.. 16 గోల్స్‌తో సూపర్‌-4కు క్వాలిఫై..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Asia Cup Hockey: టీమిండియా తరపున డిస్పన్‌ టిర్కీ 5 గోల్స్‌ కొట్టగా.. సుదేవ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో మెరిశాడు. సెల్వం, పవన్‌, వెటరన్‌ ఆటగాడు ఎస్‌వీ సునీల్‌లు కీలక సమయాల్లో గోల్స్‌తో మెరిసి భారత్‌కు విజయం అందించారు.

    ఆసియా కప్ (Asia Cup Hockey)​లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది భారత హాకీ జట్టు (Indian Hockey Team). నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది. పూల్‌-ఏలో భాగంగా ఇండోనేషియాతో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఏకంగా 16-0 తో రెచ్చిపోయిన భారత పురుషుల జట్టు సూపర్‌-4కు అర్హత సాధించింది. నాకౌట్​ దశకు అర్హత సాధించాలంటే ఇండోనేసియాపై 15 గోల్స్​ తేడాతో గెలవాల్సిన పరిస్థితిలో.. భారత పురుషుల హాకీ జట్టు 16 గోల్స్​ చేసి అద్భుతం చేసింది. టీమిండియా తరపున డిస్పన్‌ టిర్కీ 5 గోల్స్‌ కొట్టగా.. సుదేవ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో మెరిశాడు. సెల్వం, పవన్‌, వెటరన్‌ ఆటగాడు ఎస్‌వీ సునీల్‌లు కీలక సమయాల్లో గోల్స్‌తో మెరిసి భారత్‌కు విజయం అందించారు. ఇక పురుషుల ఆసియా హాకీ కప్‌ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.

    అయితే.. ఇండోనేషియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఓపెనింగ్‌ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత జపాన్‌తో జరిగిన మ్యాచ్‌ను 2-5తో ఓడి సూపర్‌-4 అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఇండోనేషియాతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో 15 గోల్స్‌ కొడితే గాని భారత్‌కు సూపర్‌-4కు అర్హత సాధించే అవకాశం ఉండేది. అదే సమయంలో జపాన్‌ చేతిలో పాకిస్తాన్‌ కూడా ఓటమి పాలవ్వాలి.


    ఇక్కడే మనకు అదృష్టం కలిసొచ్చింది. జపాన్‌ చేతిలో పాకిస్తాన్‌ ఓటమి చెందడం.. ఇండోనేషియాతో​ మ్యాచ్‌లో అనుకున్నదానికంటే ఒక గోల్‌ ఎక్కువే కొట్టిన టీమిండియా గ్రాండ్‌ విక్టరీ అందుకొని సూపర్‌-4లో అడుగుపెట్టింది. అయితే.. జపాన్‌ చేతిలో ఓటమితో 2023 హాకీ వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్‌ అర్హత సాధించలేకపోయింది. అదే సమయంలో జపాన్‌, కొరియా మలేషియాలు 2023 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. మరోవైపు 2023 హాకీ వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండడంతో ఆతిథ్య హోదాలో భారత పురుషుల హాకీ జట్టు ఇప్పటికే అర్హత సాధించింది.

    ఇది కూడా చదవండి : గెలిస్తే ఫైనల్ కు.. ఓడితే ఇంటికి.. డూ ఆర్ డై ఫైట్ లో తుది జట్లు ఇవే..!

    రెండో క్వార్టర్ ముగిసే సమయానికి ఇండోనేసియాపై 6-0తో ఆధిక్యం సంపాదించింది భారత్. ఆధిక్యం ఎక్కువగానే ఉన్నప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమణ తప్పదేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి. కానీ భారత హాకీ ఆటగాళ్లు.. మిగిలిన రెండు క్వార్టర్స్​లో 10 గోల్స్​ చేసి సంచలన విజయం సాధించారు. భారత ఆటగాడు దిప్సన్ టిర్కీ 5 గోల్స్​తో అదరగొట్టాడు. ఈ విజయంతో జపాన్​తో పాటు భారత్ నాకౌట్​కు అర్హత సాధించింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Hockey, Indonesia, Sports, Team India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు