హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics: సెమీస్‌లో ఓడిన భారత పురుషుల హాకీ జట్టు... కొంప ముంచిన పెనాల్టీ కార్నర్స్

Tokyo Olympics: సెమీస్‌లో ఓడిన భారత పురుషుల హాకీ జట్టు... కొంప ముంచిన పెనాల్టీ కార్నర్స్

టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్‌లో ఓడిన పురుషుల హాకీ టీమ్ (Twitter)

టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్‌లో ఓడిన పురుషుల హాకీ టీమ్ (Twitter)

భారత హాకీ పురుషుల జట్టు సెమీస్‌లో బెల్జియంపై 4-2 తేడాతో ఓడిపోయింది. ఇక కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నది.

    టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) 2020లో భారత పురుషుల హాకీ జట్టు మంగళవారం బెల్జియంతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 5-2 తేడాతో ఓడిపోయింది. తొలి క్వార్టర్‌లో 2-1తో ముందంజ వేసిన భారత జట్టు.. ఆ తర్వాత చాలా సేపు తమ ఆధిక్యాన్ని కాపాడుకుంది. కానీ పదే పదే పెనాల్టీ కార్నర్లు ఇస్తూ బెల్జియం జట్టు పుంజుకోవడానికి అవకాశం ఇచ్చింది. బెల్జియం జట్టు వచ్చిన అవకాశాలను ఏ మాత్రం వదులు కోకుండా గోల్స్ చేస్తూ ఆధిక్యంలోకి దూసుకొని పోయింది. చివరి క్వార్టర్‌లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో పాటు.. ఒక పెనాల్టీని గోల్ కొట్టి 4-2 తేడాతో ఆధిక్యంలోకి దూసుకొని పోయింది. భారత హాకీ ప్లేయర్లు గోల్స్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. చివర్లో బెల్జియం ప్లేయర్లు బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకొని సమయాన్ని వృధా చేశారు. నిర్ణీత సమయం ముగిసే సరికి బెల్జియం జట్టు 5-2 తేడాతో మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరింది. భారత జట్టు కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నది.

    Published by:John Kora
    First published:

    Tags: Olympics, Tokyo Olympics

    ఉత్తమ కథలు