పాకిస్థాన్‌తో క్రికెట్ నా పరిధిలో లేదు...బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ...

ఇరుదేశాల మధ్య క్రికెట్‌ ఆడటం ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని ఓ ప్రశ్నకు బదులిస్తూ గంగూలీ తెలిపారు.

news18-telugu
Updated: December 20, 2019, 6:48 PM IST
పాకిస్థాన్‌తో క్రికెట్ నా పరిధిలో లేదు...బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ...
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Image:BCCI/Twitter)
  • Share this:
పాకిస్థాన్‌తో క్రికెట్‌ తమ పరిధిలో లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. ఈ విషయంలో తుదినిర్ణయం భారత ప్రభుత్వానిదే అని గంగూలీ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య క్రికెట్‌ ఆడటం ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని ఓ ప్రశ్నకు బదులిస్తూ గంగూలీ తెలిపారు. ఇదిలా ఉంటే భారత్ పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు ముంబైపై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో పూర్తిగా దెబ్బతిన్నాయి. వరల్డ్ కప్, ఐసీసీ టోర్నీల్లో మినహా.. ఇరు జట్ల మధ్య టెస్టు, వన్డే, టీ20 క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదు. ఇదిలా ఉంటే భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ సంబంధాలు త్వరలోనే బలపడతాయని పాక్‌ క్రికెట్‌ బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ వసీంఖాన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. పీసీబీలో చేరి ఆరు నెలలు గడిచిన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

First published: December 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు