హోమ్ /వార్తలు /క్రీడలు /

Virendra sehwag: భారత జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్​ చురకలు.. ద్వైపాక్షిక సిరీస్​లు గెలిచి సంబురపడిపోతే ఎలా అంటూ..

Virendra sehwag: భారత జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్​ చురకలు.. ద్వైపాక్షిక సిరీస్​లు గెలిచి సంబురపడిపోతే ఎలా అంటూ..

వీరేంద్ర సెహ్వాగ్​ (ఫైల్​ ఫొటో)

వీరేంద్ర సెహ్వాగ్​ (ఫైల్​ ఫొటో)

వీరేంద్ర సెహ్వాగ్ (Virender sehwag)​. భారత మాజీ క్రికెటర్​ (Former Indian cricketer). ఒకప్పుడు భారత డేరింగ్​ అండ్​ డాషింగ్​ ఓపెనింగ్ బ్యాట్స్​మన్​. ఇటీవల భారత క్రికెట్​ పరిస్థితులు, కోహ్లీ కెప్టెన్సీ, టీ 20 వరల్డ్​కప్​లపై తన ఫేస్​బుక్​ ఫేజీలో వీరు స్పందించాడు. భారత జట్టుకు చురకలు కూడా అంటించాడు.

ఇంకా చదవండి ...

వీరేంద్ర సెహ్వాగ్ (Virender sehwag)​. భారత మాజీ క్రికెటర్​ (Former Indian cricketer). ఒకప్పుడు భారత డేరింగ్​ అండ్​ డాషింగ్​ ఓపెనింగ్ బ్యాట్స్​మన్​. మైదానంలోనూ కిషోర్​ పాటలు పాడుకుంటూ సిక్సర్లు అవలీలగా కొట్టిన ఘనుడు. ప్రపంచకప్​ (world cup) గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయితే వీరేంద్ర సెహ్వాగ్​కు మైదానంలో మొదటి బంతినే బౌండరీ దాటించే అలవాటు ఉండేది. ఇక రిటైర్​ అయ్యాక ఐపీఎల్ (IPL)​లో కొన్నిజట్లకు కోచ్​గా కూడా పనిచేశాడు. వ్యాఖ్యాతగా అలరిస్తున్నాడు. అప్పుడప్పుడు పత్రికలకు వ్యాసాలు రాస్తాడు. మైదానంలో లాగే బయట కూడా దూకుడు స్వభావం వీరేంద్ర సెహ్వాగ్​ది. భారత జట్టుకు కోచ్​గా దరఖాస్తులు ఆహ్వానించినపుడు ఒక లైనులోనే దరఖాస్తును పంపిన గడసరి వీరేంద్ర సెహ్వాగ్ (Virendra sehwag). కాగా, ఇటీవల భారత క్రికెట్​ పరిస్థితులు, కోహ్లీ కెప్టెన్సీ, టీ 20 వరల్డ్​కప్​లపై తన ఫేస్​బుక్​ ఫేజీలో వీరు స్పందించాడు. భారత జట్టుకు చురకలు కూడా అంటించాడు.

విరాట్ కోహ్లీ (virat kohli) సోమవారం నమీబియాతో కెప్టెన్‌గా తన చివరి T20I ఆడిన విషయం తెలిసిందే. అయితే ఇతర రెండు ఫార్మాట్లలో – టెస్ట్, వన్డేలలో నాయకత్వ (captain) పాత్రలో కొనసాగాలా వద్దా అనేది భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. భారత T20I జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ బాధ్యత సోమవారం ముగిసింది. పొట్టి ఫార్మాట్‌లో భారత కెప్టెన్‌గా తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు టోర్నీకి ముందే కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కోహ్లీ కెప్టెన్సీ నుంచి పూర్తిగా తప్పుకోవాలా వద్దా అనే ఓ అభిమాని ప్రశ్నకు సెహ్వాగ్ తన ఫేస్​బుక్​ పేజీ (Facebook page)లో స్పందించాడు. ఇది విరాట్ సొంత నిర్ణయన్నారు. కానీ, కోహ్లీ మిగిలిన రెండు ఫార్మాట్ల కెప్టెన్సీని విడిచిపెడతాడని అనుకోనన్నాడు సెహ్వాగ్​. కేవలం ఆటగాడిగా ఆడాలనుకుంటే, అది అతని నిర్ణయమని వెల్లడించాడు. ఇక విరాట్ కెప్టెన్సీలో భారత్ బాగా ఆడుతోందని భారత్​కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా కోహ్లీ పేరుగాంచాడని గుర్తు చేశాడు. కోహ్లీ చాలా తెలివైనవాడని కితాబిచ్చాడు సెహ్వాగ్..

ప్రపంచ టోర్నీలూ గెలవాలి..

సెహ్వాగ్ మాట్లాడుతూ.. “కోహ్లీ మంచి ఆటగాడు. దూకుడుగా ఉండే కెప్టెన్. భారత జట్టు (Indian team)కు ముందు నుంచి నాయకత్వం వహిస్తున్నాడు. వన్డేలు, టెస్టులలో కెప్టెన్సీని వదిలివేయడం లేదా వదలకపోవడం కోహ్లీ వ్యక్తిగత నిర్ణయం” అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. అయితే, ఐసీసీ టోర్నమెంట్‌ (ICC Tournament)లలో జట్టు పేలవ ప్రదర్శనకు మాత్రం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఓపెనర్ నొక్కి చెప్పాడు.  ‘‘మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత, భారత్ ఇంతవరకు ఐసీసీ టైటిల్‌ (ICC Title)ను గెలుచుకోలేదు. చెడ్డ దశలో మేం జట్టుకు మద్దతు ఇవ్వాలని నాకు తెలుసు, కానీ చాలా కాలం నుంచి ఏ ప్రధాన ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవలేకపోయాం. దీనిపై భారతదేశం కచ్చితంగా ఆత్మపరిశీలన (self realization) చేసుకోవాలి. ద్వైపాక్షిక సిరీస్‌లు గెలవడమే కాదు.. ప్రపంచ టోర్నీలను (world tournaments) నిలకడగా గెలిస్తేనే ప్రజలు మినల్ని గుర్తుంచుకుంటారు’’ అని సెహ్వాగ్ చురకలు అంటించాడు.

First published:

Tags: Cricket, Facebook, Icc world cut, Virender Sehwag

ఉత్తమ కథలు