
Irfan Pathan (Photo : Twitter)
Cobra Teaser : టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ త్వరలో వెండితరపై కన్పించునున్నాడు. కెమెరా ముందు ఎలాంటి క్యారెక్టర్లో అయినా ఒదిగిపోగల యాక్టర్ విక్రమ్ హీరోగా రాబోతున్న నయా మూవీ కోబ్రాలో ఇర్ఫాన్ నటించాడు.
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ త్వరలో వెండితరపై కన్పించునున్నాడు. కెమెరా ముందు ఎలాంటి క్యారెక్టర్లో అయినా ఒదిగిపోగల యాక్టర్ విక్రమ్ హీరోగా రాబోతున్న నయా మూవీ కోబ్రాలో ఇర్ఫాన్ నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైతే ఇర్ఫాన్ పఠాన్, నటుడిగా బిజీ అయ్యే అవకాశం ఉంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 90 శాతం మేర కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టింది చిత్రయూనిట్. ఈ మేరకు తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం 47 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోతోంది.టీజర్ మొదటి షాట్ నుంచి ఆఖరి దాకా ఇర్ఫాన్ పఠాన్‌ను హైలెట్ చేసింది చిత్ర బృందం. పర్ఫెక్ట్ లుక్స్‌తో సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా మారాడు ఇర్ఫాన్ పఠాన్. ఈ సినిమాలో ఇర్ఫాన్ ఇంటర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. కేఎస్ రవికుమార్, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్.
టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి భారత పేసర్ ఇర్ఫాన్ పఠాన్. స్పిన్నర్ హర్భజన్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా భారత జట్టుకి ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన ఇర్ఫాన్ పఠాన్... భారత జట్టు తరుపున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచులు ఆడి, 2700లకు పైగా పరుగులు, 300లకు పైగా వికెట్లు పడగొట్టాడు. ఫామ్ కోల్పోయి భారత జట్టుకి దూరమైన ఇర్ఫాన్ పఠాన్... 2012లో చివరి వన్డే ఆడాడు. 8 ఏళ్ల తర్వాత 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఇర్ఫాన్ పఠాన్. క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్ పఠాన్, విక్రమ్ హీరోగా రూపొందుతున్న ‘కోబ్రా’ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:January 09, 2021, 17:51 IST