హోమ్ /వార్తలు /క్రీడలు /

WTC Final : వామ్మో.. ఆ అంపైర్ వద్దే వద్దు.. అతడుంటే ఇండియా ఓడిపోవడం ఖాయం.. ఇవిగో రుజువులు

WTC Final : వామ్మో.. ఆ అంపైర్ వద్దే వద్దు.. అతడుంటే ఇండియా ఓడిపోవడం ఖాయం.. ఇవిగో రుజువులు

అతడు అంపైరింగ్ చేస్తే ఇండియా గెలవడం కష్టమే

అతడు అంపైరింగ్ చేస్తే ఇండియా గెలవడం కష్టమే

టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఇప్పుడొక సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొని వచ్చారు. త్వరలో జరుగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రిచర్డ్ కెటిల్‌బరోను అంపైర్‌గా నియమించొద్దని కోరుతున్నారు. ఎందుకంటే...

  క్రికెట్ అంటే ఒక టీమ్ గేమ్. ఒకరిద్దరు రాణించినా మ్యాచ్ గెలిచేయవచ్చు. ఆ రోజు ఎవరైతే మ్యాచ్ గెలిపిస్తే వాళ్లే హీరోలు. అందుకే చరిత్రలో కొన్ని రికార్డులు, కొందరి టాలెంట్‌ను అభిమానులు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. అలాగే క్రికెట్‌లో ఆటగళ్ల రికార్డులతో పాటు సెంటిమెంట్లు కూడా ఫాలో అవుతుంటారు. ఫలానా గ్రౌండ్‌లో ఆడితే మ్యాచ్ గెలవదు.. ఫలానా బ్యాట్స్‌మెన్ ఆ బౌలర్ చేతిలోనే అవుటవుతుంటాడనే సెంటిమెంట్లు వెంటాడుతుంటాయి. ఇవి ఎప్పుడూ ఉండే చర్చనే. కానీ తాజాగా క్రికెట్ అభిమానుల చర్చ ఒక అంపైర్ మీదకు మళ్లింది. ఆ అంపైర్ కనుక ఉంటే టీమ్ ఇండియా మ్యాచ్ గెలవదంటూ రికార్డులు కూడా చూపిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. టీమ్ ఇండియా, న్యూజీలాండ్ జట్లు జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. అయితే ఐసీసీ ఇప్పటి వరకు ఈ మ్యాచ్‌కు సంబంధించిన అఫీషియల్స్ పేర్లు ప్రకటించలేదు. అయితే ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరోను మాత్రం అంపైర్‌గా నియమించొద్దని కోరుతున్నారు. అసలు ఇండియా జట్టుకు కెటిల్‌బరోకు సంబంధం ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు విషయం తెలుసుకొని ముక్కున వేలేసుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే 2014 నుంచి ఇండియా ఆడిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేస్తే ఓడిపోయిందంటా. అప్పటి వరకు ఫుల్ ఫామ్‌లో ఉంటూ.. మ్యాచ్‌లు ఓడకుండా నాకౌట్ దశకు చేరుకున్న ఇండియా.. కెటిల్‌బరో అంపైరింగ్ చేసిన మ్యాచ్‌లలో మాత్రం ఓడిపోయిందని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.

  మొదటి సారి బంగ్లాదేశ్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఈ ఘటన ఎదురైంది. ఫైనల్‌లో టీమ్ ఇండియా, శ్రీలంక జట్లు షేర్ ఏ బంగ్లా స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియాపై శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలిచి టీ20 వరల్డ్ కప్ ఎగరేసుకొని పోయింది. ఈ మ్యాచ్‌లో రిచర్డ్‌ కెటిల్‌బరో ఒక అంపైర్

  ఆ తర్వాత ఆస్ట్రేలియా-న్యూజీలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన 2015 వన్డే వరల్డ్ కప్‌లో ఇండియాకు మరోసారి చుక్కెదురైంది. సెమీఫైనల్‌కు చేరుకున్న టీమ్ ఇండియా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 95 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో కూడా రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేశాడు

  మరుసటి ఏడాది ఇండియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరిగింది. టీమ్ ఇండియా మంచి ఫామ్‌లో ఉండి సెమీస్ వరకు దూసుకొని వచ్చింది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 192 పరుగులు చేసింది. అయితే వెస్టిండీస్ జట్టు కేవలం 19.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఫైనల్‌కు చేరుకుంది. 2016లో వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో కూడా రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేశాడు.

  ఇక 2017లో ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ ఛాంపియన్‌ ట్రోఫీ నిర్వహించారు. భారత జట్టు ఫైనల్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. లండన్‌లోని ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 180 పరుగుల భారీ తేడాతో పరాజయం చెందింది. ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు పాకిస్తాన్‌పై ఓడిపోవడం అదే తొలిసారి. ఆ మ్యాచ్‌లో కెటిల్‌బరో అంపైరింగ్ చేశాడు.

  ఇక 2019లో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ను ఎవరూ మర్చిపోలేరు. న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివర్లో మార్టిన్ గుప్తిల్ వేసిన త్రోకు ఎంఎస్ ధోనీ రనౌట్ అవడం ఎవరూ మర్చిపోలేరు. అదే సమయంలో లెగ్ అంపైర్‌గా ఉన్న రిచర్డ్ కెటిల్‌బరో కూడా 'ఓహ్' అంటూ థర్డ్ అంపైర్‌కు సిగ్నల్ కూడా ఇచ్చాడు. ఈ మ్యాచ్ కూడా భారత జట్టు కెటిల్‌బరో అంపైరింగ్ చేస్తున్నప్పుడే ఓడిపోయింది. ఈ ఉదహరణలు అన్నీ చూపిస్తూ కెటిల్ బరోను అంపైర్‌గా నియమించ వద్దని అభిమానులు కోరుతున్నారు.


  కోవిడ్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఉండటంతో ఆయా దేశాల్లో ఉండే ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్లతోనే టెస్ట్, వన్డే మ్యాచ్‌లు జరుపుతున్నారు. ఐసీసీ ప్యానల్‌లో ఎక్కువగా ఇంగ్లాండ్ అంపైర్లే ఉన్నారు. వారిలో రిచర్డ్ కెటిల్‌బరో ఒకరు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ అంపైర్లు ఎలాగో న్యూట్రల్ అంపైర్లుగానే ఉంటారు కాబట్టి వారికే ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇతర ఇంగ్లాండ్ అంపైర్లను నియమించినా రిచర్డ్ కెటిల్‌బరో మాత్రం వద్దంటున్నారు.


  ఇండియన్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా జతకలిశాడు. కెటిల్‌బరో వద్దని శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేనను అంపైర్‌గా నియమించాలని ఒక మీమ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

  Published by:John Kora
  First published:

  Tags: ICC, India vs newzealand, Team India, WTC Final

  ఉత్తమ కథలు