టీమ్ ఇండియా (Team India) ఓపెనర్ పృథ్వీషా (Pruthvi Shaw).. శ్రీలంకలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ (Suraya Kumar Yadav) ఇంగ్లాండ్ (England Tour) వెళ్లనున్నట్లు సమాచారం. అగస్టు 4 నుంచి ఇండియా-ఇంగ్లాండ్ మధ్య పటౌడి ట్రోఫీ ప్రారంభం కానున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ సిరీస్ కోసం బీసీసీఐ 24 మందితో కూడిన జట్టును ఇంగ్లాండ్ పంపించింది. అయితే వీరిలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, ఆవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ గాయపడి ఇంటికి తిరిగి వచ్చేశారు. దీంతో తమకు బ్యాకప్ క్రికెటర్లు కావాలని టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ కోరింది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌ను టెస్టు జట్టు కోసం పంపనున్నట్లు తెలుస్తున్నది. కాగా, వీరిద్దరూ మిగతా రెండు టీ20లు ఆడిన తర్వాత ఇంగ్లాండ్ వెళ్తారా? లేదంటే ముందుగానే అక్కడకు బయలుదేరతారా అనే దానిపై స్పష్టత లేదు. శ్రీలంక సిరీస్ ఈ నెల 29న ముగియనుండగా.. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ అగస్టు 4న ప్రారంభం కానున్నది. గాయపడిన శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ మొయిన్ టీమ్‌లో వాళ్లు కాగా.. ఆవేశ్ ఖాన్ నెట్ బౌలర్‌గా అక్కడకు వెళ్లాడు. పృథ్వీషాను ఓపెనర్‌గా అక్కడకు పంపనున్నారు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ అక్కడే ఉన్నాడు. మరోవైపు బ్యాకప్ ఓపెనర్‌గా వెళ్లిన అభిమన్యు ఈశ్వరన్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. దీంతో పృథ్వీషాను పంపుతున్నారు.
ఇక టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే కాలి పిక్క గాయంతో బాధపడుతున్నాడు. అగస్టు 4 వరకు అతడు కోలుకునే అవకాశం ఉన్నది. కానీ ఎందుకైనా మంచిదని ఆలోచించి అతడికి బ్యాకప్‌గా సూర్యకుమార్‌ను పంపుతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ద్ కృష్ణ, ఆర్జాన్ నాగ్వాస్‌వల్ల రిజర్వ్ క్రికెటర్లుగా ఉన్నారు. ఆస్ట్రేలియా వెళ్లిన టీమ్ ఇండియాతో పృథ్వీషా కూడా వెళ్లాడు. కానీ తొలి టెస్టులో విఫలం కావడంతో మిగతా టెస్టులకు అతడు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పృథ్వీషాను పక్కన పెట్టారు. అయితే ఇండియాలో జరిగిన తొలి దశ ఐపీఎల్‌లో పృథ్వీషా విశేషంగా రాణించాడు. స్వింగ్ డెలివరీలతో పడుతున్న ఇబ్బందిని అధిగమించి దేశవాళీ క్రికెట్‌లో కూడా రాణించాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి టెస్టు జట్టులో మరోసారి చోటు దక్కింది.
సూర్యకుమార్ యాదవ్ 2020 ఐపీఎల్‌లో అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పుడే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికవుతాడని భావించినా కాలేకపోయాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో వన్డేల్లో, శ్రీలంక పర్యటనలో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంక పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు. ఆదివారం జరిగిన తొలి టీ20లో అర్ద సెంచరీ చేశాడు. 2019-20 రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడిన యాదవ్.. 10 ఇన్నింగ్స్‌లో 508 పరుగులు చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, Team India