• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIAN CRICKETER RAVICHANDRAN ASHWIN DANCING MASTER VAATHI COMING SONG IN GROUND VIDEO WENT VIRAL MS

Ashwin As Master: మాస్టర్ సాంగ్ కు స్టెప్పేసిన అశ్విన్.. ‘వాత్తి కమింగ్..’ అంటూ అభిమానుల సందడి

Ashwin As Master: మాస్టర్ సాంగ్ కు స్టెప్పేసిన అశ్విన్.. ‘వాత్తి కమింగ్..’ అంటూ అభిమానుల సందడి

Photo Credit : Twitter

Ashwin dancing Vaathi Coming Song: రెండో ఇన్నింగ్స్ సందర్భంగా గ్రౌండ్ లో అశ్విన్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మ్యాచ్ జరుగుతుండగా... అక్కడ పెవిలియన్ లో కొంతమంది అభిమానులు ప్రముఖ తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోని ‘వాత్తి కమింగ్..’ పాటను ప్లే చేశారు.

  • News18
  • Last Updated:
  • Share this:
    Ashwin dancing Vaathi Coming Song: చెన్నై చెపాక్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 317 పరుగుల తేడాతో.. తొలి టెస్టులో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకుంది టీం ఇండియా. అయితే ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ లో ఆదుకుంటే.. బౌలింగ్ లో రవిచంద్రన్ ఇరగదీశాడు. ఇక రెండో టెస్టులో తన అద్భుత బ్యాటింగ్ తో భారత్ ను విజయతీరాలకు చేర్చాడు.

    కాగా.. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా గ్రౌండ్ లో అశ్విన్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మ్యాచ్ జరుగుతుండగా... అక్కడ పెవిలియన్ లో కొంతమంది అభిమానులు ప్రముఖ తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోని ‘వాత్తి కమింగ్..’ పాటను ప్లే చేశారు.





    ఆ క్రమంలో క్రౌడ్ నుంచి ఆ పాట విన్న అశ్విన్... మాస్టర్ సినిమాలోని సిగ్నేచర్ స్టెప్ అయిన భుజాన్ని కిందకు మీదకు ఎగరవేశాడు. కొద్ది క్షణాలపాటే అశ్విన్ చిందేసినా.. తమిళ తంబీలు మాత్రం దానిని పండుగ చేసుకున్నారు.ఇక దీనిని ఒక ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరలైంది. ఈ టెస్ట్ కు ఇదే ఫర్ఫెక్ట్ ఎండింగ్ అంటూ పలువురు క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.





    ఇదిలాఉండగా.. బౌలింగ్ లో అదరగొట్టి, మరుసటి రోజు బ్యాట్ తోనూ విశ్వరూపం చూపిన అశ్విన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే విషయంపై ఆయన భార్య ఆనందానికి అవధుల్లేవు. ట్విట్టర్ వేదికగా ఆమె ఒక చిత్రాన్ని పంచుకున్నారు. మాస్టర్ సినిమాలో విజయ్ లుక్ లో.. అశ్విన్ ను పెట్టి ఎడిట్ చేసిన పిక్ ను ఆమె షేర్ చేశారు. ఆ తర్వాత ట్వీట్ లో ‘అశ్విన్ అందర్నీ ట్రోల్ చేస్తున్నాడు...’ అంటూ లాఫింగ్ ఎమోజీ పెట్టారు. మొత్తానికి సొంతగడ్డపై అశ్విన్ నెలకొల్పిన ఈ రికార్డు టీంఇండియాతో పాటు అతడికి ప్రత్యేకంగా నిలిచింది.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు