Jayadev Unadkat: ఓ ఇంటివాడైన భారత పేస్ బౌలర్... ట్విట్టర్ లో ఫోటోలు వైరల్..

image credits twitter

Jayadev Unadkat: తన చిరకాల మిత్రురాలు రిన్నీ (Rinny) తో అతడి వివాహం మంగళవారం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఉనద్కతే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. గతేడాది మార్చి 15న ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.

  • News18
  • Last Updated :
  • Share this:
    మరో భారత క్రికెటర్ ఒక ఇంటివాడయ్యాడు. భారత క్రికెట్ జట్టు పేసర్, ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న జయదేవ్ ఉనద్కత్ (Jayadev Unadkat) వివాహం చేసుకున్నాడు. తన చిరకాల మిత్రురాలు రిన్నీ (Rinny) తో అతడి వివాహం మంగళవారం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఉనద్కతే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. గతేడాది మార్చి 15న ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఫిబ్రవరి 2న కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఈ మేరకు ఉనద్కత్ ట్విట్టర్ వేదికగా తన పెళ్లి ఫోటోను షేర్ చేశాడు.

    ఫోటోను షేర్ చేస్తూ.. ‘2021 ఫిబ్రవరి 2న మా వివాహం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో జరిగింది. మీరు మాపై కురిపించిన ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు.. ఈ అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే సమయంలో మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నాం...’ అంటూ రాసుకొచ్చాడు ఉనద్కత్.





    ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఉనద్కత్.. ఐపీఎల్-12 సీజన్ లో రూ. 8.40 కోట్లు పలికాడు. 2018 సీజన్ లో జరిగిన వేలంలో కూడా అతడు రూ. 11.5 కోట్లు పలికిన విషయం తెలిసిందే. కాగా.. ఈ రెండు సీజన్లలోనూ అతడు పెద్దగా రాణించలేదు.









    ఇదిలాఉండగా కొత్త జీవితం ప్రారంభించిన ఉనద్కత్ కు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొత్త ప్రయాణం ఆనందభరితంగా ఉండాలని ఆకాంక్షించారు.
    Published by:Srinivas Munigala
    First published: