Home /News /sports /

Harbhajan Singh : కరోనా వ్యాక్సిన్ వివాదంలో వేలు పెట్టిన హర్భజన్ సింగ్..చివరికి ఏం చేశాడంటే..

Harbhajan Singh : కరోనా వ్యాక్సిన్ వివాదంలో వేలు పెట్టిన హర్భజన్ సింగ్..చివరికి ఏం చేశాడంటే..

HARBHAJAN SINGH

HARBHAJAN SINGH

Harbhajan Singh : కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచదేశాలు వణికిపోతున్నాయ్. ఏడాది కాలంగా వ్యాక్సిన్ ఎదురుచూపులకు ఈ నెల 16న తెరపడింది. దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం సాగుతోంది. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తొందరపాటు తో కరోనా వ్యాక్సిన్ వివాదంలో వేలు పెట్టాడు.

ఇంకా చదవండి ...
    కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచదేశాలు వణికిపోతున్నాయ్. ఏడాది కాలంగా వ్యాక్సిన్ ఎదురుచూపులకు ఈ నెల 16న తెరపడింది. దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం సాగుతోంది. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తొందరపాటు తో కరోనా వ్యాక్సిన్ వివాదంలో వేలు పెట్టాడు. వివరాల్లో కెళితే కర్ణాటకలోని తుమ్కూరు ప్రాంతంలో వైద్యాధికారులు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు ఫొటోలకి ఫోజిలిస్తున్న వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో.. వైద్యాధికారులకే వ్యాక్సిన్‌పై నమ్మకండలేదంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ వీడియోని ట్రోల్ చేస్తూ సెటైర్లు వేశారు. ఈ క్రమంలో నిజానిజాలు తెలుసుకోకుండా హర్భజన్ సింగ్ కూడా ఓ ట్వీట్ చేసి వివాదంలో వేలు పెట్టాడు. తుమ్కూరులో తొలి రౌండ్ వ్యాక్సిన్‌‌ పంపిణీలో భాగంగా మొదట స్థానిక డీఎంవో నాగేంద్రప్ప, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రజినీలకి అక్కడి సిబ్బంది వేశారు. అయితే.. ఆ సమయంలో స్థానిక మీడియా అక్కడ లేకపోవడంతో.. వారు మరోసారి మీడియా కోసం వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు ఫొటోలకి పోజిలివ్వాల్సి వచ్చింది. కానీ.. ఆ ఇద్దరూ వ్యాక్సిన్ తీసుకోకుండా నటిస్తున్నారని.. కొన్ని చోట్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయనే వార్తలే అందుకు కారణమని ట్విట్టర్‌లో ఓ పోస్ట్ తెగ హల్ చల్ చేసింది.








    వ్యాక్సిన్ సమయంలో అధికారులు ఫొటోలకి పోజిలిస్తున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన హర్భజన్ సింగ్ ‘‘వాస్తవంగా మన నాయకులు కొంత మంది వ్యాక్సిన్ తీసుకుంటున్న విధానం ఇది. ఫొటోలు బాగా వచ్చాయి’’ అని సెటైరికల్ ట్వీట్ చేశాడు. కానీ.. నిజం తెలిసిన తర్వాత వెంటనే భజ్జీ ఆ ట్వీట్‌ని డిలీట్ చేసేశాడు. అయినప్పటికీ.. స్క్రీన్ షాట్ తీసిన కొంత మంది నెటిజన్లు అతడ్ని విమర్శిస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాలు తెలుసుకోకుండా అలా ఎలా ట్వీట్ చేస్తావని భజ్జీని ఓ ఆటాడుకున్నారు నెటిజన్లు. దీంతో తన తప్పు తెలుసుకున్న హర్భజన్ .. క్షమించండి అని మరో ట్వీట్ చేశాడు. ఇలా నిజనిజాలు తెలుసుకోకుండా వేలు పెట్టిన భజ్జీ..చివరికి సారీ చెప్పాల్సి వచ్చింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Corona Vaccine, Harbhajan singh, Twitter

    తదుపరి వార్తలు