Dinesh Karthik : భారత క్రికెటర్, బ్యాటర్, వికెట్ కీపర్ అయిన దినేష్ కార్తీక్.. నవంబర్ 23న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ వీడియోని పోస్ట్ చేశాడు. అందులో తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్న సంకేతం ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో చివరిగా ఆడిన తర్వాత.. ఆ ఈవెంట్‌లో తాను ఎలా గడిపిందీ, తన ఫ్యామిలీ, టీమ్‌మేట్స్‌తో ఎలా క్వాలిటీ మూమెంట్స్ ఎంజాయ్ చేసినదీ తాజా వీడియోలో దినేష్ చూపించాడు.
ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు.. టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేస్తున్న సెలక్టర్ల లిస్టులో దినేష్ కార్తీక్ పేరు లేదు. ఐతే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లో దినేష్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించడంతో.. దినేష్ కార్తీక్‌కి మార్గం సుగమమైంది. షార్ట్ టెర్మ్ ఫార్మాట్‌లో స్పెషలిస్ట్ ఫినిషర్‌గా అతన్ని ఎంపిక చేసుకున్నారు.
టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఉండాలన్నది తన డ్రీమ్ అని.. కొంతకాలంగా ఈ వికెట్ కీపర్ చెబుతూ వచ్చాడు. తన దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించిన కార్తీక్.. తనతోపాటూ జర్నీ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. తనను నేషనల్ టీమ్‌లోకి తెచ్చిన వారికి థాంక్స్ చెప్పాడు.
Cow Dung-Neem Plaster : పేడతో ఇటుకలు.. ఇది కదా ఇన్నోవేషన్ అంటే..
ఈ ఎమోషనల్ వీడియోని గమనిస్తే.. అతను తిరిగి బ్లూ జెర్సీ వేసుకునే అవకాశాలు ఉన్నట్లు కనిపించట్లేదు. దానికి పెట్టిన క్యాప్షన్ చూస్తే.. "టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా తరపున ఆడేందుకు హార్డ్ వర్క్ చేశాను. చాలా గర్వంగా ఉంది. ఇది నా జీవితంలో ఎన్నో మధురస్మతులు మిగిల్చింది. నా తోటి ప్లేయర్లు, కోచ్‌లు, స్నేహితులు, ముఖ్యంగా అశేష అభిమానం చూపుతున్న ఫ్యాన్స్‌కి ధన్యవాదాలు. కల నిజమైంది" అని క్యాప్షన్‌లో రాశాడు.
ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
View this post on Instagram
ఈమధ్యే ముగిసిన న్యూజిలాండ్ టీ-20 సిరీస్‌లో దినేష్ కార్తీక్‌ని తీసుకోలేదు. టీట్వంటీ వరల్డ్ కప్‌లో 22 బాల్స్ ఆడి.. 14 రన్స్ మాత్రమే చేయడంతో.. ఈ వెటెరన్‌కి ఛాన్స్ దక్కలేదు. ఐతే.. మాజీ సెలెక్టర్ చేతన్ శర్మ మాత్రం.. ఇండియన్ టీమ్‌లోకి తీసుకునేందుకు ఇప్పటికీ డీకేను పరిగణనలోకి తీసుకోవచ్చని అన్నాడు. అందువల్ల అతన్ని సెలెక్టర్లు తిరిగి జట్టులోకి తీసుకుంటారా అనేది హాట్ టాపిక్ అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Dinesh Karthik, T20 World Cup 2022