గ్రౌండ్లో రఫ్ఫాడించే క్రికెటర్లు వెండి తెరపై కూడా మెరుస్తున్నారు. ఆటతో అదరగొట్టడమే కాదు.. నటనతోనూ అలరిస్తామంటున్నారు. ఇప్పటికే పలువురు క్రికెటర్లు సినిమాల్లో నటించగా.. తాజాగా మరో క్రికెటర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. టీమిండియా గబ్బర్.. శిఖర్ ధావన్ (Shikhar Dhawan) నటుడిగా అరంగ్రేటం చేయబోతున్నాడు. బాలీవుడ్లో ఓ సినిమాలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఐతే ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. అంటే సీక్రెట్‌గానే మూవీ చేసేశాడన్న మాట. శిఖర్ ధావన్ మూవీ టైటిల్ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.
శిఖర్ ధావన్ నటిస్తున్న మూవీలో పనిచేస్తున్న ఓ కీలక వ్యక్తి మాట్లాడుతూ.. ''శిఖర్‌కు నటీనటులంటే ఎప్పటి నుంచో చాలా గౌరవం. ఈ చిత్రంలో ఆయనకు ఒక పాత్రను ఆఫర్ చేశాం. వెంటనే ఓకే చేసేశారు. ఆయన సినిమాల్లో నటించినందుకు సంతోషంగా ఉంది. ఆ క్యారెక్టర్ శిఖర్ ధావన్ పర్ఫెక్ట్గా సరిపోతాడని మూవీ మేకర్స్ భావించారు. దీనిపై కొన్ని నెలల క్రితమే ఆయన్ను సంప్రదించారు. అది ఫుల్ లెంగ్త్ రోల్. సినిమాకు ఆ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల కావచ్చు.'' అని పేర్కొన్నారు.
పూజా హెగ్డే, రష్మిక మందన్న.. ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చూపిస్తోన్న భామలు..
గతేడాది 'రామసేతు (Ram setu)' మూవీ సెట్లో శిఖర్ ధావన్ కనిపించాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్(Akshay Kumar)తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez), నుష్రత్ భారుచా (Nushrratt Bharuccha) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శిఖర్ సెట్స్‌కి వెళ్లడంతో.. ఆయన ఈ సినిమాలో నటిస్తున్నాని ప్రచారం జరిగింది. కానీ శిఖర్ ధావన్ 'రామసేతు' సినిమాతో తెరంగేట్రం చేయడం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలసింది. శిఖర్ ధావన్, అక్షయ్ కుమార్ మంచి స్నేహితులు. ఈ క్రమంలోనే ఆయన క్యాజువల్‌గానే మూవీ సెట్‌కు వెళ్లి.. అక్షయ్ కుమార్‌ని కలిశారు. అక్షయ్ మాత్రమే కాదు..మరికొందరు బాలీవుడ్ నటులతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి.
NBK 107 సెట్స్‌లో దర్శకుడు గోపీచంద్ మలినేని, తమన్‌తో బాలకృష్ణ లేటెస్ట్ పిక్.. సోషల్ మీడియాలో వైరల్..
కాగా, పలువురు క్రికెటర్లు ఇప్పటికే సినిమాల్లో నటించి.. అభిమానుల మన్ననలు పొందారు. ఇటీవల భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh)కూడా తమిళ చిత్రం 'డిక్కిలూనా'లో అతిధి పాత్ర పోషించాడు. ఇక స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'ఫ్రెండ్షిప్'లో ప్రధాన పాత్ర పోషించాడు. మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan).. విక్రమ్ మూవీ కోబ్రాలో నటించాడు. ఇందులో విలన్ రోల్లో యాక్ట్ చేశాడు పఠాన్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. యువరాజ్ సింగ్, సునీల్ గవాస్కర్, అజయ్ జడేజా, కపిల్ దేవ్‌తో పాలు మరికొందరు క్రికెటర్లు కూడా సినిమాల్లో అతిథి పాత్రల్లో సందడి చేసిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Cricket, Shikhar Dhawan, Sports