టీమిండియాకు ఉగ్ర ముప్పు.. పాక్, బీసీసీఐలకు బెదిరింపు మెయిల్..

WI Vs India : ఆటగాళ్ల భద్రత విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని అంటిగ్వాలోని భారత హైకమిషన్ అధికారి అన్నారు. అక్కడ భారత ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్, దాని పరిసరాలపై పటిష్టమైన నిఘా ఉందన్నారు.

news18-telugu
Updated: August 19, 2019, 10:57 AM IST
టీమిండియాకు ఉగ్ర ముప్పు.. పాక్, బీసీసీఐలకు బెదిరింపు మెయిల్..
టీమిండియా (Image : Twitter)
  • Share this:
వెస్టిండీస్‌ టూర్‌లో ఉన్న టీమిండియా జట్టుకు ఉగ్ర ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు కలకలం రేపాయి. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఓ అనామక మెయిల్ నుంచి సమాచారం అందింది. విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టుపై దాడులు జరపబోతున్నామని అందులో పేర్కొన్నారు. పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెంటనే ఆ మెయిల్‌ను ఐసీసీకి పంపించింది. ఇటు బీసీసీఐకి కూడా అలాంటి మెయిలే రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బీసీసీఐ భారత హోంమంత్రిత్వ శాఖకు సమాచారం అందించడంతో.. అంటిగ్వాలోని భారత హైకమిషన్‌ను అలర్ట్ చేశారు. దీంతో ఆటగాళ్లకు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఆటగాళ్ల భద్రత విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని అంటిగ్వాలోని భారత హైకమిషన్ అధికారి అన్నారు. అక్కడ భారత ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్, దాని పరిసరాలపై పటిష్టమైన నిఘా ఉందన్నారు. కాగా, ఉగ్రదాడుల బెదిరింపు హెచ్చరికలతో వచ్చిన మెయిల్ బోగస్ అని అధికారులు తేల్చినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే, విండీస్‌తో టీ20,వన్డే సిరీస్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా ఈ నెల 22న ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు ససన్నద్దమవుతోంది. ఇందుకోసం కూలిడ్జ్‌లో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతోంది. టెస్టు సిరీస్‌ను కూడా నెగ్గి విండీస్‌కు తమ దెబ్బ మరోసారి రుచి చూపించాలనుకుంటోంది.

 

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు