వెండితెర గూటికి చేరుతున్న భారత మాజీ క్రికెటర్లు..

మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ తమిళ సినిమాల ద్వారా తెరంగేట్రం చేయబోతున్నారు. విక్రమ్ హీరోగా రానున్న సినిమాలో ఇర్ఫాన్ నటిస్తుండగా.. సంతానం ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రంలో భజ్జీ పరిచయం కాబోతున్నాడు.

news18-telugu
Updated: October 18, 2019, 11:23 AM IST
వెండితెర గూటికి చేరుతున్న భారత మాజీ క్రికెటర్లు..
Twitter
  • Share this:
మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ తమిళ సినిమాల ద్వారా తెరంగేట్రం చేయబోతున్నారు. విక్రమ్ హీరోగా రానున్న సినిమాలో ఇర్ఫాన్ నటిస్తుండగా.. సంతానం ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓ చిత్రంతో భజ్జీ పరిచయం కాబోతున్నాడు. దీంతో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు సినిమా రంగంలోకి అడుగు పెట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బౌలర్ శ్రీశాంత్ సినిమాల్లో నటిస్తుండగా ఆ బాటలోనే పేస్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, హర్భజన్ సింగ్‌లు ఈ లిస్ట్‌లో చేరడం విశేషం.అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ ఓ సినిమా లో నటిస్తున్నాడు.  ఈ సినిమాలో ఇర్ఫాన్‌ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. టర్కీకి చెందిన పోలీసు అధికారి పాత్రలో ఇర్ఫాన్‌ పఠాన్‌  అదరగొట్టనున్నారని సమాచారం. భారీ బడ్జెట్‌తో వస్తోన్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు కమెడియన్‌ సంతానం త్రిపాత్రాభినయం చేస్తున్న ‘డిక్కీలోనా’లో హర్బజన్‌ ఓ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు యువన్ శంకర్​రాజా సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ విషయాన్ని హర్భజన్ సింగ్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు