#HappyBirthdayRahulDravid: 'గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్' రాహుల్

టెస్ట్‌ల్లో మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమైనా ఒంటరి పోరాటం చేసి భారత జట్టు పరువు కాపాడిన సంధర్భాలెన్నో. బెస్ట్ బ్యాటింగ్ టెక్నిక్‌తో క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకరిగా ఎదిగాడు.

news18-telugu
Updated: January 11, 2019, 1:23 PM IST
#HappyBirthdayRahulDravid: 'గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్' రాహుల్
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ( ICC/ Twitter )
news18-telugu
Updated: January 11, 2019, 1:23 PM IST
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. నేడు (జనవరి 11) రాహుల్ బర్త్‌డే. అంతర్జాతీయ క్రికెట్‌కు భారత్ అందించిన అరుదైన క్రికెటర్‌ రాహుల్ అని చెప్పుకుంటారు. జిడ్డు బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన ద్రావిడ్‌...కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. 1996లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అప్పట్లో ఇంటర్నేషనల్ క్రికెటర్ ప్రమాణాలకు సరిపోయె బ్యాటింగ్ టెక్నిక్ లేదని విమర్శించిన వారెందరో. అయినా నిరాశ చెందకుండా ఒక్కో మెట్టు ఎక్కి...బెస్ట్ బ్యాటింగ్ టెక్నిక్‌తో క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకరిగా ఎదిగాడు. మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించినా...టెస్ట్ క్రికెటర్‌గా భారత జట్టులో తనదైన ముద్ర వేశాడు. టెస్ట్‌ల్లో మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమైనా ఒంటరి పోరాటం చేసి భారత జట్టు పరువు కాపాడిన సంధర్భాలెన్నో. టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా సాధించిన ఎన్నో చిరస్మరణీయ విజయాల్లోనూ కీలక పాత్ర పోషించాడు.అభిమానులు ద్రావిడ్‌ను 'ద వాల్' 'గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్'గా పిలుస్తారు.

2001లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి నెలకొల్పిన రికార్డ్ భాగస్వామ్యం భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ తరంలో భారత జట్టుకు ఆడినందుకే రాహుల్‌కు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదని ఎంతో మంది క్రికెట్ దిగ్గజాలు చెబుతుంటారు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే వారందరూ...నెట్స్‌లో బ్యాటింగ్ చేయడం కంటే, రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్ వీడియోలు చూస్తే చాలని ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు ఇప్పటికీ కాన్ఫిడెంట్‌‌గా చెబుతుంటారు.

16 ఏళ్ల తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో భారత్ తరఫున 509 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 24,208 పరుగులు చేశాడు. అందులో 48 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలున్నాయి. 2018లో అండర్-19 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. 164 టెస్ట్‌ల్లో 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలతో 13,288 పరుగులు చేశాడు. 344 వన్డేల్లో 12 సెంచరీలు,83 హాఫ్ సెంచరీలతో 10,889 రన్స్ చేశాడు. ఒకే ఒక్క ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

Loading...






First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...