టోక్యో ఒలింపిక్స్ 2020లో మరో ఇండియన్ అథ్లెట్ పతకం కొల్లగొట్టింది. మహిళల బాక్సింగ్ వెల్టర్ వెయిట్ (64-69 కేజీల) విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా బోర్గహైన్ సెమీఫైనల్లో ఓడిపోయింది. దీంతో లవ్లీనాకు కాంస్య పతకం దక్కింది. బుధవారం సెమీఫైనల్లో టర్కీకి చెందిన బుసెనాజ్ సుర్మెనెలితో తలపడింది. ప్రపంచ చాంపియన్ అయిన బుసెనాజ్ మొదటి నుంచి లవ్లీనాపై ఆధిపత్యం చెలాయించింది. మూడు బౌట్లలో బుసెనాజ్ 5-0 గెలిచినట్లు ప్రకటించారు.
Tags: Boxing, Olympics, Tokyo Olympics