Home /News /sports /

INDIAN BATSMEN FAILURE IN SECOND TEST FIRST DAY MAY MISS CHANCE OF WINNING TEST SERIES AK

Ind Vs SA: చేతులెత్తేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. భారమంతా బౌలర్లదే.. మంచి ఛాన్స్ మిస్ అవుతుందా ?

Ajinkya Rahane - Cheteshwar Pujara

Ajinkya Rahane - Cheteshwar Pujara

Ind Vs SA: భారత మిడిల్ ఆర్డర్ రిషబ్ పంత్, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ వంటి వాళ్లు క్రీజులో నిలదొక్కుకున్నట్టు కనిపించినా.. ఆశించదగ్గ స్కోర్లు సాధించడంలో విఫలమయ్యారు.

    దక్షిణాఫ్రికాతో వారి స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు అతిథ్య జట్టు పైచేయి సాధించింది. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు టీమిండియా బ్యాట్స్‌మెన్ చతికలపడ్డారు. తొలి రోజు మన బ్యాట్స్‌మెన్ 202 పరుగులకే అలౌట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సఫారీ జట్టులో మ్యాచ్ ముగిసేసరికి ఒకే ఒక్కరిని పెవిలియన్ పంపగలిగారు టీమిండియా బౌలర్లు. భారత్ పేసర్ మహ్మద్ షమీ కేవలం 7 పరుగులకే ఐడెన్ మార్క్రామ్‌ను వెనక్కి పంపడంతో భారత్‌ ఆదిలోనే బ్రేక్ లభించింది. ఇక తొలి రోజు ఆట ముగిసేసరికి సఫారీ జట్టు భారత్ కంటే 167 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి టెస్టులో దక్షిణాఫ్రికాను 113 పరుగుల తేడాతో ఓడించిన భారత్, రెండో టెస్టులోనూ విజయం సాధించి సఫారీ గడ్డపై తొలిసారిగా సిరీస్‌ని కైవసం చేసుకోవాలని భావించింది. రెండో టెస్టును గెలుచుకోవడం ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో టెస్టు ఉండగానే గెలుచుకోవాలని చూసింది.

    కానీ టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రెండో టెస్టులో మొదట బ్యాటింగ్‌కు దిగిన మన బ్యాట్స్‌మెన్.. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్స్ సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి క్రీజులో నిలువలేకపోయారు. వెన్ను నొప్పి కారణంగా విరాట్ కోహ్లి టీమ్‌లో లేకపోవడం టీమిండియాకు మైనస్‌గా మారింది. భారత్ బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, అశ్విన్ జట్టుకు టాప్ స్కోరర్లుగా మిగిలారు. దీన్ని బట్టి టీమిండియా బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్.. మంచి ఆరంభం ఇచ్చే ప్రయత్నం చేశారు.

    అయితే మయాంక్‌ను మార్కో జాన్సెన్ 26 పరుగుల వద్ద పెవిలియన్ పంపాడు. అయితే ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ నుంచి రాహుల్‌కు సహకారం లభించలేదు. ఛెతేశ్వర్ పుజారా (33 బంతుల్లో 3), అజింక్యా రహానే (0 బంతుల్లో 1)లను డువాన్ ఒలివర్ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. అయితే తన సహచరుల నుండి ఎటువంటి సహాయం అందనప్పటికీ రాహుల్ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు.

    Ind Vs Sa : దండం రా నాయనా మీ ఇద్దరికీ.. మీరు టీమిండియాకు చేసిన సేవలు ఇక చాలు..

    Ind Vs Sa : కేఎల్ రాహుల్ కూడా ఔట్.. ఐదు వికెట్లు డౌన్.. ఇక, పంత్ పైనే ఆశలు..

    భారత మిడిల్ ఆర్డర్ రిషబ్ పంత్, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ వంటి వాళ్లు క్రీజులో నిలదొక్కుకున్నట్టు కనిపించినా.. ఆశించదగ్గ స్కోర్లు సాధించడంలో విఫలమయ్యారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లు బాగా రాణించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు తీయగా, కగిసో రబడా, డువాన్ ఒలివర్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. ఇక సిరీస్ విషయానికొస్తే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో రెండు జట్లు విక్టరీపై ఫోకస్ పెట్టాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: India vs South Africa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు