సైనా నెహ్వాల్ పెళ్లిడేట్ ఫిక్స్, వరుడు పారుపల్లి కశ్యప్!

డిసెంబర్ 16న నిరాడంబంగా పెళ్లి... డిసెంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్ పార్టీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 26, 2018, 4:00 PM IST
సైనా నెహ్వాల్ పెళ్లిడేట్ ఫిక్స్, వరుడు పారుపల్లి కశ్యప్!
పారుపల్లి కశ్యప్‌తో సైనా నెహ్వాల్ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 26, 2018, 4:00 PM IST
భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. సహచర ఆటగాడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌తో ఆమె వివాహం జరగబోతోంది. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇద్దరూ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి పార్టీలకూ, ఫంక్షన్లకూ జట్టుగా వెళ్లడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో సైనా, కశ్యప్ ప్రేమ వ్యవహారం ఎప్పుడో బయటికి వచ్చింది. అయితే ప్రేమ గురించి, పెళ్లి గురించి కానీ ఇంతవరకూ ఈ ఇద్దరిలో ఎవ్వరూ కూడా స్పందించకపోవడం విశేషం.

అయితే సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయని, త్వరలో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయని తెలుస్తోంది. సైనా నెహ్వాల్, కశ్యప్ ఇద్దరూ కూడా హైదరాబాదీలే. ఇద్దరూ కోచ్ పుల్లెల గోపిచంద్ శిక్షణలో రాటుతేలినవారే. దాంతో ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి... త్వరలో పెళ్లిపీటలు ఎక్కేదాకా చేరింది. సైనా నెహ్వాల్, కశ్యప్ పెళ్లికి డిసెంబర్ 16న ముహుర్తం కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. పెద్దగా ఆర్భాటం లేకుండా అతికొద్ది మంది సన్నిహితుల మధ్య సైనా వివాహం జరగనున్నట్టు సమాచారం.

పెళ్లి నిరాడంబంగా చేసుకున్నా, ఆ తర్వాత ఐదు రోజులకి డిసెంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్ పార్టీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ పార్టీకి క్రీడా ప్రముఖులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరవ్వబోతున్నారు.

First published: September 26, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...