ఏషియాడ్: ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు!

21-17, 15-21, 21-10 తేడాతో జపాన్ క్రీడాకారణి యమగూచీపై గెలుపు... ఏషియాడ్‌లో ఫైనల్ చేరిన మొట్టమొదటి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన తెలుగు తేజం!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: August 27, 2018, 1:19 PM IST
ఏషియాడ్: ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు!
పీవీ సింధు
  • Share this:
తెలుగు తేజం పీవీ సింధు మరోసారి సంచలనం సృష్టించింది. ఏషియాడ్ సెమీఫైనల్లో పీవీ సింధు, జపాన్ క్రీడాకారిణి యమగూచీపై వీరోచిత విజయం సాధించింది. మూడు సెట్ల పాటు సాగిన ఈ పోరులో 21-17, 15-21, 21-10 తేడాతో గెలుపొంది, ఏషియాడ్‌లో చరిత్రలోనే ఫైనల్ చేరిన మొట్టమొదటి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత షెట్లర్ సైనా నెహ్వాల్‌పై గెలుపొందిన తైవాన్ షెట్లర్, వరల్డ్ నెం. 1 టీజూతో ఫైనల్లో తలపడనుంది పీవీ సింధు.

ఏషియాడ్ 2018 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్‌లో జపాన్ ప్లేయర్ యమగూచీతో తలపడిన భారత స్టార్ షెట్లర్ చిరస్మరనీయ విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభంలోనే 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది పీవీ సింధు. అయితే ఆ తర్వాత పుంజుకున్న యమగూచీ 3-3తో స్కోర్ సమం చేసింది. ఆ తర్వాత జపాన్ క్రీడాకారిణికి ఎటువంటి అవకాశం ఇవ్వని పీవీ సింధు 5-4తో లీడ్‌లోకి దూసుకెళ్లింది. 11-8 తేడాతో ముందుకు దూసుకెళ్లి 21- 17తో మొదటి సెట్ సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్లో అన్యూహ్యంగా పుంజుకుంది యమగూచీ. రెండో సెట్ ప్రారంభంలో ఇద్దరి మధ్య రసవత్తరమైన పోరు జరిగింది. 3-3 తో స్కోర్ సమం చేసిన యమగూచీ, సింధు మెరుపు షాట్లతో విరుచుకుపడడంతో 7-4తో వెనకబడింది. ఒకానొక దశలో రెండో సెట్‌లో కూడా సింధు గెలుపు ఖాయమని భావించారంతా. కానీ ఈ దశలోనే మ్యాజిక్ చేస్తూ 11-10తో లీడ్‌లోకి దూసుకొచ్చింది యమగూచీ.

ఆ తర్వాత సింధుకి అవకాశం ఇవ్వకుండా ఆధిక్యాన్ని మెరుగుపరుచుకుంటూ 15-21 తో రెండో సెట్ సొంతం చేసుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్‌లో పూర్తిగా సింధు ఆధిపత్యమే కనిపించింది. 5- 10, 8- 16 పాయింట్ల లీడ్‌లోకి దూసుకెళ్లిన పీవీ సింధు, అలసిపోయిన యమగూచీని ఓ ఆటాడేసుకుంది. సింధు జోరుకి 21- 10 తేడాతో మూడో సెట్ కోల్పోయింది జపాన్ క్రీడాకారిణి యమగూచీ. ఏషియాడ్ చరిత్రలోనే సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా పీవీ సింధు రికార్డు సృష్టించింది.

ఇదీ చదవండి
ఏషియాడ్ 2018: సెమీస్‌లో ఓడిన సైనా, కాంస్యంతో సరి!
Published by: Ramu Chinthakindhi
First published: August 27, 2018, 12:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading