Tokyo Olympics: జావెలిన్ త్రో ఫైనల్‌కు నీరజ్ చోప్రా.. ఫైనల్ ఎప్పుడంటే?

జావెలిన్ త్రో ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే? (SAI Media/Twitter)

టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించాడు.

  • Share this:
    టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics 2020) మరో భారత అథ్లెట్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. బుధవారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో (Javelin Throw) పురుషుల గ్రూప్-ఏ క్వాలిఫై రౌండ్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఫైనల్‌కు (Final) అర్హత సాధించాడు. తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్లు విసిరి ఫైనల్ రౌండ్‌కు చేరాడు. ఈ సీజన్‌లో అత్యధిక దూరం విసిరిన ఫిన్లాండ్ అథ్లెట్ లస్సి ఇటెలాట తర్వాత స్థానంలో నీరజ్ చోప్రా ఉండటం గమనార్హం. జావెలిన్ త్రో ఫైనల్ పోటీలు ఈ నెల 7న జరుగనున్నాయి. డిస్కస్ త్రో మహిళల విభాగంలో కూడా కమల్‌ప్రీత్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ అక్కడ పతకానికి సరిపడా విసరలేకపోయింది.

    మరోవైపు జావెలిన్ త్రోలో భారత్ తరపున పాల్గొన్న మరో అథ్లెట్ శివ్‌పాల్ సింగ్ పేలవ ప్రదర్శన చేశాడు. గ్రూప్-బి క్వాలిఫై రౌండ్‌లో అతను 76.40 మీట్లు విసిరి 12వ స్థానంలో నిలిచాడు. దీంతో అతడు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.
    Published by:John Naveen Kora
    First published: