టోక్యో ఒలింపిక్స్లో (Tokyo Olympic) భారత్కు (India) తొలి పతకం వచ్చే అవకాశం వచ్చింది. ఆర్చరీలో (Archery) మిక్స్డ్ విభాగంలో (Mixed Event) ఇండియా బృందం క్వార్టర్ ఫైనల్కరు చేరుకుంది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దీపికా కుమారి (Deepika Kumari), ప్రవీణ్ జాదవ్ (Praveen Jadav) కలసి చైనీస్ తైపీ జోడీపై 5-3 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టు క్వార్టర్ ఫైనల్ చేరుకున్నది. క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియా ఆర్చర్లతో తలపడనున్నది. వారితో జరిగే పోటీలో భారత జట్టు విజయం సాధిస్తే సెమీస్కు చేరుకుంటుంది. అప్పుడు భారత జట్టుకు తప్పకుండా పతకం లభించే అవకాశం ఉన్నది. మరోవైపు భారత షూటర్లు ఫైనల్ చేరుకోలేక నిరాశపరిచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics