టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) తొలి రోజే భారత అథ్లెట్లు (Indian Athletes) నిరాశాజనకమైన ఫలితాలు సాధించారు. తప్పకుండా పతకాలు గెలుస్తారనే నమ్మకం పెట్టుకున్న ఆర్చర్లు (Archery) ర్యాంకింగ్ రౌండ్లోనే తడబడ్డారు. వరల్డ్ నెంబర్ 1 దీపికా కుమారి మహిళల వ్యక్తిగత కర్వ్ సీడింగ్ రౌండ్లో 663 పాయింట్లతో 9వ స్థానంతో సరిపెట్టుకున్నది. ఇక సౌత్ కొరియాకు చెందిన కాంగ్ చీయాంగ్ మాత్రం 692 పాయింట్లతో వరల్డ్ రికార్డు సృష్టించింది. రౌండాఫ్ 32లో భూటాన్‌కు చెందిన కర్మతో తలపడనున్నది. ఇక ఆ తర్వాత పురుషుల వ్యక్తిగత కర్వ్ క్వాలిఫియేషన్స్ జరిగాయి. ఇందులో భారత ఆర్చర్లు విఫలమయ్యారు. వ్యక్తిగత విభాగంలో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్ దీప్ పాల్గొన్నారు. ముగ్గురు కూడా ఫ్లాప్ షో చేశారు. కనీసం టాప్ 25లో కూడా వీళ్లు ముగ్గురు చోటు దక్కించుకోలేకపోయారు. అతాను దాస్ 35వ స్థానంలో, ప్రవీణ్ జాదవ్ 31వ స్థానంలో, తరుణ్‌దీప్ రాయ్ 37వ స్థానంలో నిలిచారు. వీళ్లు ముగ్గురు సీడింగ్ రౌండ్లో సరైన ప్రదర్శన చేయకపోయినా నాకౌట్ రౌండ్‌కు వెళ్లారు. ఇది కేవలం సీడింగ్స్ నిర్ణయించే రౌండ్ కావడంతో ఎవరూ పోటీల నుంచి నిష్క్రమించాల్సిన అవసరం రాలేదు.
అతాను దాస్ మొత్తం 72 బాణాలు సంధించాల్సి ఉండగా వాటలో 24 సార్లు 10 పాయింట్లు సాధించినా ఆరు సార్లు ఏమీ పాయింట్లు లేక వెనక బడ్డాడు. మొత్తానికి 653 పాయింట్లు సాధించాడు. ప్రవీణ్ జాదవ్ ఇరవై రెండు సార్లు పది పాయింట్లతో మొత్తం 656 పాయింట్లు సాధించాడు. తరుణ్ దీప్ ఇరవై ఆరు 10 పాయింట్లతో 652 పాయింట్లు సాధించాడు. గత కొంత కాలంగా అతాను దాస్ వ్యక్తిగత విభాగంలో విఫలమవుతూ వస్తున్నాడు. టీమ్ ఈవెంట్లో భార్య దీపికా కుమారితో కలసి మంచి ఫామ్‌లోనే ఉన్నా.. వ్యక్తిగత కర్వ్ దగ్గరకు వచ్చే సరికి విఫలమవడం ఆందోళన చెందిస్తున్నది. అయితే నాటౌక్ పోటీల్లో అయినా పుంజుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.
Tokyo Olympics: నిరాశ పరిచిన దీపికా కుమారి.. క్వాలిఫికేషన్ రౌండ్లో 9వ స్థానం.. కానీ..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics