నా సలహాతోనే కోహ్లి నెం 1 బ్యాట్స్‌మెన్ అయ్యాడు: కిర్‌స్టెన్‌

మెుదటి టీమిండియాకు కోహ్లి ఆడుతున్న సమయంలో అతనిలో ఉన్న బ్యాటింగ్ సామర్ధ్యాన్ని గుర్తించాను. యువ ఆటగాడైనా అతను అనుభవం లేకపోవడంతో ప్రతిభను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో ఈవిషయంపై చాలా సార్లు అతనితో మాట్లాడానని" గ్యారీ పేర్కొన్నాడు.

Rekulapally Saichand
Updated: July 15, 2020, 4:41 PM IST
నా సలహాతోనే కోహ్లి నెం 1 బ్యాట్స్‌మెన్ అయ్యాడు: కిర్‌స్టెన్‌
విరాట్ కోహ్లీ (Image: BCCI)
  • Share this:
తను ఇచ్చిన సూచనాలతోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్‌లో మెరుగైనా ప్రదర్శనను కొనసాగిస్తున్నాడని టీమ్‌ఇండియా మాజీ చీఫ్‌ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ తెలిపారు. అత్యుత్తమంగా బ్యాటింగ్ చేసే సామర్య్ధం తనలో ఉన్నప్పటికి దానిని ఉపయోగించుకోవడంలో మెుదటిలో కోహ్లీ విఫలమయ్యాడాన్నారు. తర్వాత తనను పిలిచి మాట్లాడి సలహాలు ఇచ్చినట్లు తెలిపారు.

"మెుదట్లో టీమిండియాకు కోహ్లి ఆడుతున్న సమయంలో అతనిలో ఉన్న బ్యాటింగ్ సామర్ధ్యాన్ని గుర్తించాను. యువ ఆటగాడైనా అతనికి అనుభవం లేకపోవడంతో తనలోని  ప్రతిభను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో ఈ విషయంపై చాలా సార్లు అతనితో మాట్లాడానని" గ్యారీ పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా విరాట్ బ్యాటింగ్ సంబంధించి ఓ సందర్భాన్ని  కూడా గుర్తుచేస్తున్నాడు. " భారత్,శ్రీలంక మధ్య జరిగిన ఓ వన్డేలో కోహ్లి జోరుగా ఆడుతూ 30 పరుగులపైగా సాధించాడు. జోరు మీద ఉన్న అతను తల మీదగా వేసిన ఓ బంతిని సిక్స్‌గా  మలచబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం పెవిలియన్‌కు చేరిన కోహ్లికి కొన్ని సూచనలు చేశాను. నీ ఆట ముందుకు వెళ్ళాలంటే అలాంటి బంతులను లాంగ్‌ఆన్‌లో సింగిల్‌ తీయాలి. బంతులను స్టేడియం బమటకు కొట్టే సామర్ధ్యం నీకున్నప్పటీకి.. అలాంటి బంతులు ప్రమాదం కూడా దాగి ఉంటుందని విరాట్‌కు సూచించాను. తర్వాత కోల్‌కతాలో జరిగిన వన్డేలో సెంచరీతో కోహ్లి సెంచరి సాధించాడని " తెలిపారు.
Published by: Vijay Bhaskar Harijana
First published: July 15, 2020, 4:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading