హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ: టీమ్ ఇండియాలోకి టాప్ వికెట్ టేకర్ అరంగేట్రం.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ

IND vs NZ: టీమ్ ఇండియాలోకి టాప్ వికెట్ టేకర్ అరంగేట్రం.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా (PC: BCCI)

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా (PC: BCCI)

IND vs NZ: న్యూజీలాండ్‌తో రాంచీలో జరుగుతున్న రెండో టీ20లో రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ హయ్యెస్ట్ వికెట్ టేకర్ హర్షల్ పటేల్ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట లోకి అరంగేట్రం చేస్తున్నాడు.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (T20 Series) భాగంగా ఇవాళ రాంచీ వేదికగా రెండో మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బౌలింగ్ ఎంచుకున్నాడు. 'మేం ముందుగా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ మ్యాచ్‌కు మంచు ప్రభావం ఉంటుందని భావిస్తున్నాము. ఇక్కడ ఛేజ్ చేయడం అనుకూలంగా ఉంటుంది. తొలి గేమ్‌లో ఛేజింగ్ చేయడం ద్వారా మాకు కొంచెం అనుభవం వచ్చింది. మ్యాచ్‌ను పాజిటివ్‌గా ముగించాము. యువకులకు ఈ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ మ్యాచ్‌లో సిరీస్ బదులు హర్షల్ పటేల్‌ను తీసుకున్నాము' అని రోహిత్ శర్మ చెప్పాడు. ఇక న్యూజీలాండ్ (New Zealand) కెప్టెన్ టిమ్ సౌథీ (Tim southee) మాట్లాడుతూ టాస్ గెలిస్తే నేను కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నాను. తొలి మ్యాచ్ ఓడినా మాకు కొన్ని పాజిటివ్ అంశాలు కనపడ్డాయి. మా బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. అంతే కాకుండా చివరి వోవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలో పడేయడంలో బౌలర్లు విజయం సాధించారు. ఈ రోజు కూడా మంచి క్రికెట్ ఆడతాము. జట్టులో మూడు మార్పులు చేశామని టిమ్ సౌథీ అన్నాడు.

రాంచీలో పిచ్‌పై చాలా తక్కువ గడ్డి ఉన్నది. ఇది ఎక్కువగా స్పిన్నర్లకు, కటర్స్ వేసే పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం లాభిస్తుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ కాస్త బ్యాటర్లకు సహకరించే అవకాశం ఉన్నది. ఈ పిచ్‌పై సగటున 155 స్కోర్ లభించే అవకాశం ఉన్నది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు 160+ చేస్తే విజయావకాశాలు ఉన్నాయి.

20 League: ఎమిరేట్స్ టీ20 లీగ్‌లో జట్లు కొన్న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్.. లీగ్‌లో భారతీయుల ఆధిపత్యంఇక టీమ్ ఇండియా తరపున హర్షల్ పటేల్ ఈ రోజు అరంగేట్రం చేస్తున్నాడు. అజిత్ అగార్కర్ అతడికి క్యాప్ ఇచ్చి అంతర్జాతీయ క్రికెట్‌లోకి స్వాగతం పలికాడు. ఐపీఎల్‌లో 30కి పైగా వికెట్లు తీసిన హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. అతడు ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై హ్యట్రిక్ కూడా నమోదు చేశాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆర్సీబీ విజయాల్లో ముఖ్య పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని పటేల్ అన్నాడు. తొలి మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ అరంగేట్రం చేయగా.. రెండో మ్యాచ్‌లో పటేల్‌కు చాన్స్ వచ్చింది.

First published:

Tags: Cricket, India vs newzealand, Rohit sharma, Team India

ఉత్తమ కథలు