Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    హ్యాట్రిక్ కొట్టిన టీంఇండియా... టెస్టుల్లో మళ్లీ ఛాంపియన్లుగా కోహ్లీ సేన

    India Test Championship : వరుసగా మూడు సంవత్సరాలు ఐసీసీ ఛాంపియన్‌షిప్ గెలుచుకోవడమంటే మాటలు కాదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టూర్లలో చూపించిన మెరుగైన ప్రదర్శన కలిసొచ్చింది.

    Krishna Kumar N | news18-telugu
    Updated: April 2, 2019, 9:10 AM IST
    హ్యాట్రిక్ కొట్టిన టీంఇండియా... టెస్టుల్లో మళ్లీ ఛాంపియన్లుగా కోహ్లీ సేన
    ఐసీసీ గద అందుకున్న కోహ్లీ
    • Share this:
    ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను టీమిండియా మరోసారి దక్కించుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏప్రిల్‌ 1కి 116 పాయింట్లతో కోహ్లీసేన మూడో ఏడాది కూడా నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచి టెస్టు ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. 10 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది. ఏడాది కాలంగా భారత్‌లోనే కాకుండా... విదేశాల్లో జరిగిన టెస్టుల్లో కూడా సత్తాచాటింది టీమిండియా. ఏటా ఏప్రిల్ 1 నాటికి టెస్టుల్లో నెం.1 ర్యాంక్‌లో ఉన్న జట్టుకి ప్రత్యేక గదని ఇస్తారు. టీంఇండియా తర్వాతి స్థానాన్ని న్యూజిలాండ్‌ దక్కించుకుంది. కివీస్ జట్టుకు 5 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. ఆ జట్టు కెప్టెన్‌ కేన్‌‌ను విలియమ్సన్‌ 2018 సంవత్సరానికి ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు వరించింది.

    2018లో ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లిన టీంఇండియా 5 టెస్టుల సిరీస్‌ని 1-4తో చేజార్చుకుంది. అయినప్పటికీ చక్కగా పోరాడగలిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లి తిరుగులేని పెర్ఫార్మెన్స్‌తో 72 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ... 2-1తో తొలిసారి కంగారూ గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలిచింది.

    రెండేళ్లుగా రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు ఈసారి 105 పాయింట్లతో మూడో స్థానానికి జారిపోయింది. ఆ జట్టుకు 2లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ రాగా, ఇంగ్లండ్‌ 104 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి లక్ష డాలర్లు సొంతం చేసుకుంది.

    ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. చాలా గర్వంగా ఉందన్న కోహ్లీ... అన్ని ఫార్మాట్లలోనూ టీంఇండియా చక్కని ప్రదర్శన చేస్తోందన్నాడు. టెస్టు క్రికెట్‌లో బాగా రాణించిన వారే ముందుకు వెళ్తారని తన అభిప్రాయం చెప్పాడు.

     

    ఇవి కూడా చదవండి :

    టాస్ బదులు ట్విట్టర్ పోల్... ఫోర్ కొడితే 8, సిక్స్ కొడితే 12... ఇది ఏప్రిల్ ఫూల్ కాదు... ఐసీసీ నిర్ణయాలు

    భర్తపై దాడి చేసి... భార్యను గ్యాంగ్ రేప్ చేసి... హర్యానాలో నడిరోడ్డుపై అరాచకం...

    భర్త నిక్ జోనాస్‌పై అభిమాని బ్రా విసిరితే... గాల్లో ఊపి సందడి చేసిన ప్రియాంక చోప్రా

    ఒక్క మహిళ కోసం పోలింగ్ బూత్... ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే...

     
    First published: April 2, 2019, 9:10 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading