ఇండియన్ ఉమెన్ క్రికెటర్ తానియా భాటియా (Taniya Batia)కు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల టీ20, వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటన (England Tour)కు వెళ్లిన జట్టులో సభ్యురాలైన తానియా చోరీకి గురైంది. లగ్జరీ హోటల్‌లో సెక్యూరిటీ లేని కారణంగా తన విలువైన నగలు, క్యాష్ చోరీకి గురయ్యాయని ఆమె తాజాగా తెలిపింది. లండన్(London)లోని ఓ హోటల్‌లో బస చేసిన సమయంలో తన వస్తువులను ఎవరో దొంగిలించినట్లు సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. భారత జట్టుకు భద్రత కల్పించడంలో ఈసీబీ విఫలమైందంటూ తానియా ట్వీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేసింది.
సెప్టెంబర్ 10 నుంచి 24 వరకు ఇంగ్లీష్ గడ్డపై జరిగిన టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపికైన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ తానియా భాటియా ఒకరు. బ్రిటీష్ జట్టుపై ఒక టీ20 మ్యాచ్‌లో ఆడిన తానియాకు.. వన్డే సిరీస్ మూడు మ్యాచ్‌ల్లోనూ బరిలోకి దిగే అవకాశం దక్కలేదు. ఈ సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లిన ఉమెన్ క్రికెటర్లు లండన్‌లోని మారియట్ హోటల్‌లో బస చేశారు. అక్కడ తనకు కేటాయించిన హోటల్ రూమ్‌లో ఈ దొంగతనం జరిగినట్లు తానియా ట్విటర్ పోస్టులో పేర్కొంది. దీనికి సంబంధించి సోమవారం సాయంత్రం రెండు ట్వీట్లు చేసింది.
* ట్వీట్‌లో ఏముంది?
‘లండన్‌లోని మారియట్ హోటల్ మేనేజ్‌మెంట్ తీరుతో షాక్‌కు, అసంతృప్తికి గురయ్యాను. ఎవరో నా పర్సనల్ రూమ్‌కు వెళ్లి క్యాష్, కార్డులు, వాచ్‌లతో పాటు ఆభరణాలు ఉన్న నా బ్యాగ్‌ను దొంగిలించారు. ఈ హోటల్ సురక్షితం కాదు. ఈ విషయంపై వీలైనంత త్వరగా విచారణ చేపట్టి, పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాను.
2/2 Hoping for a quick investigation and resolution of this matter. Such lack of security at @ECB_cricket's preferred hotel partner is astounding. Hope they will take cognisance as well.@Marriott @BCCIWomen @BCCI
— Taniyaa Sapna Bhatia (@IamTaniyaBhatia) September 26, 2022
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు పార్ట్నర్ అయిన ఇలాంటి హోటల్‌లో భద్రతా వైఫల్యం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటనతో వారు కూడా జాగ్రత్తపడతారని భావిస్తున్నాను.’ అని వరుస ట్వీట్స్‌లో పేర్కొంటూ మారియట్ హోటల్స్‌ను, ఈసీబీని ట్యాగ్ చేసింది. అయితే ఈ ట్వీట్‌పై ECB ఇంకా స్పందించలేదు. కాగా, తానియా ఇప్పటి వరకు భారత జట్టు తరఫున 19 వన్డేలు, 53 టీ20లు ఆడింది.
* వన్డే సిరీస్ క్లీన్ స్వీప్
ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోయింది. అయితే వన్డే సిరీస్‌ను మాత్రం మనవాళ్లు క్లీన్‌స్వీప్ చేశారు. లార్డ్స్‌లో జరిగిన చివరి వన్డేలో విజయంతో ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ 3-0 తేడాతో కప్ అందుకుంది. ఈ సిరీస్‌తో సీనియర్ బౌలర్ ఝులన్ గోస్వామి రిటైర్‌మెంట్ ప్రకటించింది. అలాగే ఇండియన్ బౌలర్ దీప మన్కడింగ్ వార్తల్లో నిలిచింది. తాజాగా తానియా చోరీ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs england, Smriti Mandhana, Team India, Women's Cricket