• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA WOMEN TEAM TO PLAY TEST MATCH AFTER 7 YEARS ECB SCHEDULE FOR INDIA TOUR JNK

Cricket : ఏడేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్న టీమ్ ఇండియా... త్వరలో ఇంగ్లాండ్ పర్యటన

Cricket : ఏడేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్న టీమ్ ఇండియా... త్వరలో ఇంగ్లాండ్ పర్యటన

ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న భారత మహిళా క్రికెట్ జట్టు [PC: BCCI]

  • Share this:
    మహిళా క్రికెట్‌ను (Women Cricket) మరింత అభివృద్ది పరిచేందుకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)(ECB), బీసీసీఐ (BCCI) నడుం భిగించాయి. కరోనా కారణంగా అంతర్జాతీయ స్థాయిలో మహిళా క్రికెట్ మ్యాచ్‌లు తగ్గిపోయాయి. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)కి ఆటంకం కలగడంతో ద్వైపాక్షిక సిరీస్ వాయిదా పడ్డాయి. పురుషుల క్రికెట్ పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. కానీ మహిళా క్రికెట్ మాత్రం ఇంకా పూర్తిగా పుంజుకోలేదు. కరోనా కారణంగా బయోబబుల్ వాతావరణ ఏర్పాటు చేసి మ్యాచ్‌లు నిర్వహించాల్సి వస్తున్నది. కమర్షియల్‌గా లాభదాయకం కాని మహిళా క్రికెట్ కోసం బయోబబుల్ ఏర్పాటు చేయడం అవసరమా అనే సందిగ్దంలో క్రికెట్ బోర్డులు ఉన్నాయి. బయోబబుల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే కారణంగా క్రికెట్ ఆడే చిన్నదేశాలు, అసోసియేట్ దేశాలు పురుషుల క్రికెట్ కూడా నిర్వహించడం లేదు. ఈ నేపథ్యంలో ఈసీబీ పూర్తి స్థాయి మహిళా క్రికెట్ కోసం షెడ్యూల్ రూపొందించింది. ఈ ఎండాకాలంలో న్యూజీలాండ్, ఇండియా జట్లను తమ దేశానికి ఆహ్వానించింది.

    భారత మహిళ జట్టు త్వరలో ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నది. టీమ్ ఇండియా పురుషుల జట్టు ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడటానికి వారం ముందు మహిళా జట్టు ఇంగ్లాండ్‌తో నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ ఆడనున్నది. జూన్ 16 నుంచి బ్రిస్టల్‌లో నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఆ తర్వాత జూన్ 27 నుంచి మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానున్నది. బ్రిస్టర్, టాంటన్, వార్సెస్టర్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతుాయి. ఇక జులై 9 నుంచి ఇరు జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి. నార్తాంప్టన్, హోవ్, ఛెమ్స్‌ఫోర్డ్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయని ఈసీబీ సీఈవో టామ్ హారిసన్ పేర్కొన్నారు. ఇండియా సిరీస్ అనంతరం సెప్టెంబర్‌లో న్యూజీలాండ్ మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నది. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో మూడు టీ20లు, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నారు.

    ఈ రెండు సిరీస్‌లు ముగిసిన అనంతరం అక్టోబర్‌లో ఇంగ్లాండ్ మహిళా జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనున్నది. వచ్చే ఏడాది మహిళా వన్డే వరల్డ్ కప్ ఉండటంతో ఇంగ్లాండ్ జట్టు సాధ్యమైనన్న వన్డే మ్యాచ్‌లు ఆడటానికి ప్రయత్నిస్తున్నట్లు ఈసీబీ అధికారులు తెలిపారు. భారత మహిళా జట్టు కూడా ఇంగ్లాండ్ పర్యటన అనంతరం మరిన్ని వన్డే మ్యాచ్‌లు ఆడటానికి షెడ్యూల్ రూపొందిస్తున్నది. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో నిర్వహించే టీ20 చాలెంజ్ ట్రోఫీలో పలు దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లను కూడా రప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు