Home /News /sports /

T20 World Cup: నమీబియాతో మ్యాచ్‌లో టీమిండియా గెలుపు.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమణ

T20 World Cup: నమీబియాతో మ్యాచ్‌లో టీమిండియా గెలుపు.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమణ

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్

టీ20 వరల్డ్ కప్ లీగ్ దశలో టీమిండియా-నమీబియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ అవకాశాలను చేజార్చుకున్న టీమిండియా నామమాత్రపు మ్యాచ్‌లో సాధించిన ఈ విజయంతో టోర్నీ నుంచి హ్యాట్రిక్ విజయాలతో నిష్క్రమించింది.

ఇంకా చదవండి ...
    దుబాయ్: టీ20 వరల్డ్ కప్ లీగ్ దశలో టీమిండియా-నమీబియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ అవకాశాలను చేజార్చుకున్న టీమిండియా నామమాత్రపు మ్యాచ్‌లో సాధించిన ఈ విజయంతో టోర్నీ నుంచి హ్యాట్రిక్ విజయాలతో నిష్క్రమించింది. నమీబియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నమీబియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత శర్మ, కేఎల్ రాహుల్ శుభారంభాన్ని అందించారు.

    రోహిత్ శర్మ 37 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్స్‌లతో 56 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 36 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 54 పరుగులతో రాణించి నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా రోహిత్ వికెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత క్రీజులోకొచ్చిన సూర్య కుమార్ యాదవ్ 19 బంతుల్లో 25 పరుగులు చేశాడు. దీంతో.. టీమిండియా నమీబియా పెట్టిన టార్గెట్‌ను ఒక వికెట్ నష్టానికి 15.2 ఓవర్లలోనే 136 పరుగులు చేసి ముగించింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Dubai, T20 World Cup 2021, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు