India vs Australia: రాజ్‌కోట్ వన్డేలో కోహ్లీ సేనకు అగ్ని పరీక్ష... కంగారూల జోరుకు కళ్లెం వేసేదెలా..

తొలి వన్డే పరాజయం ఒక రకంగా కోహ్లీ సేనకు ఘోర పరాభవం అనే చెప్పాలి. ఆ వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో కోలుకోలేని షాక్ తగిలింది. బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. 50 ఓవర్ల మ్యాచులో కనీసం ఒక్క వికెట్‌ కూడా తీయలేక పోయారు. ఈ అంశమే అందరిని కలవరానికి గురిచేస్తోంది.

news18-telugu
Updated: January 17, 2020, 11:56 AM IST
India vs Australia: రాజ్‌కోట్ వన్డేలో కోహ్లీ సేనకు అగ్ని పరీక్ష... కంగారూల జోరుకు కళ్లెం వేసేదెలా..
(Image: Twitter)
  • Share this:
వాంఖడే స్టేడియంలో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియాకు రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డే కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిస్తేనే భారత్ సిరిస్ ఆశలు నిలిచే చాన్స్ ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ కూడా మొదటి మ్యాచ్ లాగానే ఆడేందుకు సిద్ధమవుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆసీస్ మొదటి మ్యాచ్ లో పూర్తి ఆధిక్యం కనబరచింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్‌ మొదటి మ్యాచులో ఆకాశమే హద్దుగా చెలరేగి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించారు. తొలి వన్డే పరాజయం ఒక రకంగా కోహ్లీ సేనకు ఘోర పరాభవం అనే చెప్పాలి. ఆ వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో కోలుకోలేని షాక్ తగిలింది. బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. 50 ఓవర్ల మ్యాచులో కనీసం ఒక్క వికెట్‌ కూడా తీయలేక పోయారు. ఈ అంశమే అందరిని కలవరానికి గురిచేస్తోంది.

రాజ్ కోట్ వన్డేలో టీమిండియా రోహిత్‌ శర్మపైనే ఆశలు పెట్టుకుంది. ధావన్ కూడా ఫామ్‌లోకి వస్తే భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయం.ఇక కేఎల్ రాహుల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. తొలి వన్డేలో కేఎల్ రాహుల్ రాణించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి విజృంభిస్తే టార్గెట్ చేజింగ్ సులభం అవుతుంది. శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, జడేజా సైతం రాణించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది.

జట్ల వివరాలు..

టీమిండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ (డబ్ల్యూ), విరాట్ కోహ్లీ (సి), శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శివం దుబే, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యదువ్ యుజ్వేంద్ర చాహల్



ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ (w), డి ఆర్సీ షార్ట్, అష్టన్ టర్నర్, జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జాంపా, అష్టన్ అగర్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్
First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు