Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విరాట్ సేన..

ఇండియా, వెస్టిండీస్ మధ్య ద్వైపాక్షిక వన్డే సిరీస్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇప్పటికే చెరో వన్డే గెలిచి సమ ఉజ్జీలుగా నిలిచాయి భారత్, విండీస్ జట్లు. ఇప్పుడు నిర్ణయాత్మక మూడో మ్యాచ్ కటక్‌లో జరుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 22, 2019, 1:16 PM IST
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విరాట్ సేన..
ind vs wi 3rd one day match
  • Share this:
ఇండియా, వెస్టిండీస్ మధ్య ద్వైపాక్షిక వన్డే సిరీస్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇప్పటికే చెరో వన్డే గెలిచి సమ ఉజ్జీలుగా నిలిచాయి భారత్, విండీస్ జట్లు. ఇప్పుడు నిర్ణయాత్మక మూడో మ్యాచ్ కటక్‌లో జరుగుతుంది. హోరాహోరీగా సాగుతున్న ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తొలి రెండు మ్యాచ్‌లలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది విండీస్ జట్టు. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో భారత్ టాస్ నెగ్గింది. ఈ సారి విరాట్ కోహ్లీ కూడా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చాలా విశేషాలున్నాయి. రోహిత్ శర్మ మరో 9 పరుగులు చేస్తే కాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు బ్యాట్స్‌మెన్‌గా సచిన్ రికార్డును అధిగమిస్తాడు.
India Vs WI 3rd one day in Cuttack and Ind won the toss elected to field pk ఇండియా, వెస్టిండీస్ మధ్య ద్వైపాక్షిక వన్డే సిరీస్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇప్పటికే చెరో వన్డే గెలిచి సమ ఉజ్జీలుగా నిలిచాయి భారత్, విండీస్ జట్లు. ఇప్పుడు నిర్ణయాత్మక మూడో మ్యాచ్ కటక్‌లో జరుగుతుంది. ind vs wi,ind vs wi 3rd odi,ind vs wi 3rd odi 2019,india vs west indies,ind vs wi 3rd odi live,india vs west indies 3rd odi live,india vs west indies 3rd odi 2019,ind vs wi 2019,ind vs wi dream11,ind vs wi dream11 team,ind vs wi live match today,ind vs wi live,ind vs wi 3rd odi playing 11,ind vs wi live criket match,ind vs wi 3rd odi 2019 playing 11
కుల్దీప్ యాదవ్

అలాగే కుల్దీప్ యాదవ్ కూడా 100 వికెట్లకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు షమీ అతి తక్కువ మ్యాచ్‌లలో 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. ఇప్పుడు భారత్ తరఫున షమీతో కలిసి ఆ రికార్డ్ షేర్ చేసుకోవాలంటే 54వ వన్డే ఆడుతున్న కుల్దీప్.. మూడో వన్డేలో ఒక్క వికెట్ పడగొట్టాల్సి ఉంటుంది. బలాబలాల పరంగా చూస్తుంటే విండీస్ కంటే భారత జట్టు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. పైగా టాప్ ఆర్డర్ భీకరమైన ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. వెస్టిండీస్ మార్పులేవీ లేకుండా బరిలోకి దిగితే.. ఇండియా తరఫున బౌలర్ నవదీప్ శైనీ తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. భారత్ ఈ మైదానంలో గత మ్యాచ్ ఇంగ్లండ్‌తో ఆడింది. అప్పుడు ఇండియా 381 పరుగులు చేస్తే.. బదులుగా ఇంగ్లండ్ 365 పరుగులు చేసింది. అందుకే ఇప్పుడు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నామని చెప్పాడు విరాట్.

First published: December 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు