మరో 3 పరుగులు చేస్తే.. కోహ్లి ఖాతాలో మరో రికార్డు..

విండీస్‌తో తొలి టీ20లో 94 పరుగులతో అదరగొట్టిన కెప్టెన్ కోహ్లి.. మరో ప్రపంచ రికార్డుకు చేరువలో ఉన్నాడు.

news18-telugu
Updated: December 7, 2019, 9:12 PM IST
మరో 3 పరుగులు చేస్తే.. కోహ్లి ఖాతాలో మరో రికార్డు..
విరాట్ కోహ్లి
  • Share this:
విండీస్‌తో తొలి టీ20లో 94 పరుగులతో అదరగొట్టిన కెప్టెన్ కోహ్లి.. మరో ప్రపంచ రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు టీ20ల్లో కోహ్లి చేసిన పరుగులు 2544 కాగా.. మరో 3 పరుగులు చేస్తే రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక టీ20 పరుగుల రికార్డును అధిగమిస్తాడు. అయితే రెండో టీ20లో రోహిత్ కూడా ఆడుతాడు కాబట్టి.. రోహిత్ కంటే ఎక్కువ స్కోర్ చేయగలిగితేనే ఆ రికార్డు కోహ్లి సొంతమవుతుంది. దీంతో కోహ్లి రోహిత్‌ను అధిగమిస్తాడా..? లేక రోహిత్ ఆ రికార్డును నిలబెట్టుకుంటాడా? అన్న ఆసక్తి నెలకొంది.

తాజా ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ ద్వారా మరో రికార్డును కూడా కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఆ రికార్డు రోహిత్ పేరిట ఉండగా.. కోహ్లి రోహిత్‌ను అధిగమించి రికార్డు దక్కించుకున్నాడు. అలాగే టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు అత్యధికసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందిన ఆటగాడిగా ఆఫ్ఘన్ ఆటగాడు మహమ్మద్ నబీ పేరిట ఉన్న రికార్డును కోహ్లి సమం చేశాడు. మొదటి టీ20లో అద్భుతంగా ఆడిన కోహ్లి.. రెండో టీ20లోనూ అదే ఫామ్ కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. తిరువనంతపురం వేదికగా ఆదివారం రెండో టీ20 జరగనుంది.First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>