IND VS WI : వెస్టిండీస్‌తో నేడు రెండో టీ20... గెలిస్తే సిరీస్ భారత్‌దే...

India vs West Indies 2nd T20 : వెస్టిండీస్‌తో తొలి టీ-20ని ఓ రేంజ్‌లో ఉతికారేసిన టీమిండియా... రెండో టీ-20లోనూ అదే జోరు కొనసాగించేందుకు రెడీ అయ్యింది. తమ విజృంభణ ఎలా ఉంటుందో రాత్రి 7 గంటలకు చూడమంటోంది.

news18-telugu
Updated: December 8, 2019, 6:34 AM IST
IND VS WI : వెస్టిండీస్‌తో నేడు రెండో టీ20... గెలిస్తే సిరీస్ భారత్‌దే...
IND VS WI : వెస్టిండీస్‌తో నేడు రెండో టీ20... గెలిస్తే సిరీస్ భారత్‌దే...
  • Share this:
India vs West Indies 2nd T20 : వన్డేల్లో స్కోరు... టీ20లోనే నమోదైతే... ఆ టార్గెట్‌ (208)ని ఛేదించడం కష్టమని క్రికెట్ అభిమానులు నిరాశతో ఉన్నప్పుడు... టీమిండియా... అలవోకగా టార్గెట్‌ను ఛేదించేస్తే... ఇక పండగేగా. వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తొలి టీ20ని అద్భుత విజయంతో ముగించిన టీమిండియా... ఇవాళ రెండో టీ20లో రికార్డుల మోత మోగించేస్తామంటోంది. మ్యాచ్ గెలిచేసి... సిరీస్ కొట్టేస్తామంటోంది. ఐతే... ఉప్పల్‌లో జరిగిన తొలి టీ20లో మన బౌలర్ల తీరు, ఫీల్డింగ్‌పై అభిమానులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ కేరళ... తిరువనంతపురంలోని... గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగే రెండో మ్యాచ్‌లో ఆ రెండు విషయాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోబోతున్నారు. ఐతే... తొలి టీ20ని చేజేతులా జారవిడుచుకున్న విండీస్... రెండో మ్యాచ్‌ను ఎట్టి పరిస్థితుల్లో భారత్ చేతిలో పెట్టబోమని అంటోంది. ఇది కూడా ఓడితే... రేటింగ్ మరింత పడిపోవడం ఖాయం. అందుకే... తీవ్ర ఒత్తిడిలో ఉంది కరీబియన్ టీమ్‌.


ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక రన్స్ సాధించిన ఆటగాడిగా నిలిచేందుకు రోహిత్‌ (2547), కోహ్లీ (2544)కి ఈ మ్యాచ్‌ పోటాపోటీగా మారింది. విండీస్‌తో తొలి టీ20లో 94 పరుగులతో అదరగొట్టిన కెప్టెన్ కోహ్లీ... ఇప్పటివరకు టీ20ల్లో చేసిన పరుగులు 2544 కాగా... మరో 3 పరుగులు చేస్తే రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక టీ20 పరుగుల రికార్డును అధిగమిస్తాడు. నేటి మ్యాచ్‌లో రోహిత్ కూడా ఆడుతాడు కాబట్టి... రోహిత్ కంటే ఎక్కువ స్కోర్ చేయగలిగితేనే ఆ రికార్డు కోహ్లీ సొంతమవుతుంది. దీంతో కోహ్లీ రోహిత్‌ను అధిగమిస్తాడా..? లేక రోహిత్ తన రికార్డును నిలబెట్టుకుంటాడా? అన్న ఆసక్తి నెలకొంది.

జట్లు (అంచనా)టీమ్ ఇండియా : విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, రాహుల్‌, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే, శ్రేయాస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌, చాహల్‌, దీపక్‌ చాహర్‌.

వెస్టిండీస్‌ టీమ్ : పొలార్డ్‌ (కెప్టెన్‌), సిమ్మన్స్‌, లూయిస్‌, హెట్‌మయెర్‌, బ్రాండన్‌ కింగ్‌, పూరన్‌, హోల్డర్‌, పియెర్‌, కాట్రెల్‌, హేడెన్‌ వాల్ష్‌, విలియమ్స్‌.

 

Pics : తెలుగు తెరపైకి మరో అందాల కేరళ కుట్టిఇవి కూడా చదవండి :

జరిగింది ఎన్‌కౌంటరేనా? NHRC ఏం చెప్పబోతోంది?

జగన్‌కి మేలుచేసిన కేసీఆర్... వైసీపీ హ్యాపీ

Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి

Health Tips : ఎంతకీ చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి చాలు


Health Tips : చక్కటి ఆరోగ్యానికి 5 సూత్రాలు... పాటిస్తే ఎంతో మేలు

First published: December 8, 2019, 6:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading