థర్డ్ అంపైర్ చేతికి నో బాల్... భారత్, వెస్టిండీస్ సిరీస్ నుంచే అమలు...

ఫ్రంట్ ఫుట్ నోబాల్‌ను ఇకపై థర్డ్ అంపైర్ ధ్రువీకరించనున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ ధ్రువీకరించింది. దీన్ని ట్రయల్ బేసిస్ మీద పరీక్షించనున్నారు.

news18-telugu
Updated: December 5, 2019, 7:15 PM IST
థర్డ్ అంపైర్ చేతికి నో బాల్... భారత్, వెస్టిండీస్ సిరీస్ నుంచే అమలు...
పిచ్ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
ఫ్రంట్ ఫుట్ నోబాల్‌ను ఇకపై థర్డ్ అంపైర్ ధ్రువీకరించనున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ ధ్రువీకరించింది. దీన్ని ట్రయల్ బేసిస్ మీద పరీక్షించనున్నారు. భారత్, వెస్టిండీస్ సిరీస్ నుంచే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ఐసీసీ ప్రకటించింది. గతంలో ఫ్రంట్ ఫుట్ నోబాల్‌ను ఫీల్డ్ అంపైర్లు నిర్ధారించేవారు. భారత్, వెస్టిండీస్ మధ్య మూడు టీ20లు, 3 వన్డేల సిరీస్ హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ నుంచే ట్రయల్ ప్రాతిపదికన ఈ కొత్త విధానాన్నిఅమలు చేయనున్నట్టు ఐసీసీ ప్రకటించింది. బౌలర్ వేసే ప్రతి బాల్‌ను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత థర్డ్ అంపైర్ మీద ఉంది. ఫ్రంట్ ఫుట్ వేశారా? లేదా? అనేది చూడాల్సింది వారేనని ఐసీసీ తెలిపింది. ఫ్రంట్ ఫుట్ నోబాల్‌ను థర్డ్ అంపైర్ గుర్తించినట్టయితే, ఈ విషయాన్ని ఫీల్డ్‌లో ఉన్న అంపైర్‌కు సమాచారం చేరవేయాలి. వెంటనే ఫీల్డ్ అంపైర్ దాన్ని నోబాల్‌గా ప్రకటిస్తాడు. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ ఫ్రంట్ ఫుట్ నోబాల్‌ను గుర్తించినా.. థర్డ్ అంపైర్ చెప్పకపోతే దాన్ని నోబాల్‌గా ప్రకటించడానికి వీల్లేదు. దీని వల్ల మానవతప్పిదాల నుంచి కొంతమేర బయటపడడానికి అవకాశం ఉందని ఐసీసీ భావిస్తోంది.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>