Ind Vs WI 2nd Test : బుమ్రా హ్యాట్రిక్‌... ఇండియాలో మూడో బౌలర్‌గా రికార్డు

Jasprit Bumrah : పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న జస్ప్రీత్ బుమ్రా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. క్రమంగా తన ఫామ్ పెంచుకుంటూ... రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 1, 2019, 7:25 AM IST
Ind Vs WI 2nd Test : బుమ్రా హ్యాట్రిక్‌... ఇండియాలో మూడో బౌలర్‌గా రికార్డు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టీమిండియా ఫాస్ట్‌ పేస్ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ సాధించాడు. వరుస బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్‌ రికార్డు సృష్టించాడు. జమైకాలోని సబీనా పార్క్ స్టేడియంలో జరుగుతున్న ఇండియా, వెస్టిండీస్ రెండో టెస్టు... తొమ్మిదో ఓవర్‌లో రెండో బంతికి డారెన్‌ బ్రావో(4)... స్లిప్‌లో కేఎల్‌ రాహుల్‌ చేతికి చిక్కగా... మూడో బంతికి బ్రూక్స్‌(0) ఎల్బీగా పెవిలియన్ బాట పట్టాడు. నాలుగో బంతికి చేజ్‌(0) కూడా ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ అయ్యాడు. దాంతో అరుదైన రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నట్లైంది. అంతకుముందు ఏడో ఓవర్‌లో ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌(2) కూడా బుమ్రా బౌలింగ్‌లోనే పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. బుమ్రా బౌలింగ్ మ్యాజిక్‌ వల్ల తక్కువ రన్స్‌కే... వెస్టిండీస్ 4 వికెట్లు కోల్పోయినట్లైంది. 10 ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయి... 14 పరుగులే చెయ్యగలిగింది. టెస్ట్ క్రికెట్‌లో ఇండియా నుంచీ ఇది మూడో హ్యాట్రిక్‌ రికార్డు. ఇదివరకు 2001లో స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్‌ సాధించగా... 2006లో ఇర్ఫాన్‌ పఠాన్‌... పాక్‌పై హ్యాట్రిక్‌ కొట్టాడు. 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ఫీట్ చేసి చూపించి... అభిమానులను సంబరాల్లో ముంచెత్తాడు బుమ్రా.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది 44వ హ్యాట్రిక్. 2017లో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ ఈ రికార్డు సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఈ ఫీట్ చేయగలిగింది బుమ్రానే. ఇదే టెస్టులో హనుమ విహారీ... తన మొదటి టెస్ట్ సెంచరీని నమోదుచేశాడు. ఫలితంగా టీమ్ ఇండియా... రెండో టెస్ట్... రెండో రోజు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్‌కి 416 రన్స్ చేసింది.

First published: September 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>