ఉప్పల్‌లో నేడు టీ20 మ్యాచ్.. అర్ధరాత్రి 1 వరకు మెట్రో రైళ్లు

స్టేడియం మొత్తం సీసీ కెమెరాల ఆధీనంలో ఉంటుంది. తక్షణ వైద్య సేవల కోసం 3 -8 అంబులెన్స్‌లు, 4-5 ఫైరింజన్లను అందుబాటులో ఉంచారు.

news18-telugu
Updated: December 6, 2019, 6:43 AM IST
ఉప్పల్‌లో నేడు టీ20 మ్యాచ్..  అర్ధరాత్రి 1 వరకు మెట్రో రైళ్లు
ఎందుకంటే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రయాణం కోసం ప్రత్యేకంగా ఛార్టర్‌ విమానాలను కేటాయించాలి. అలాగే వసతి కోసం హోటళ్లను పూర్తిగా బుక్‌ చేసుకోవాల్సిందే. ఒక గదిలో ఒక్కరే ఉండడంతో పాటు రెండు గదుల తర్వాత మరో రూమ్‌ను ఖాళీగా ఉంచాలి.
  • Share this:
హైదరాబాద్‌లో క్రికెట్ సందడి నెలకొంది. ఇవాళ సాయంత్రం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం)లో ఇండియా-వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ జరగబోతోంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక టీ20 మ్యాచ్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో స్టేడియం పరిసరాల్లో 1800 పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇవాళ బ్లాక్ డే నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్టేడియం వద్ద బలగాలను మోహరించారు. ఆక్టోపస్, ట్రాఫిక్ పోలీసులు, సిసి కెమెరాలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సైబర్ క్రైం పోలీసులు, డాగ్ స్క్వాడ్ టీం ఇందులో ఉంటారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. అభిమానులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సదుపాయం కల్పించామని తెలిపారు.


భద్రతా కారణాల దృష్ట్యాల ఉప్పల్ స్టేడియంలోనికి సిగరెట్లు, ల్యాప్ టాప్స్, హెల్మెట్లు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బైనాకులర్స్, బ్యాగ్స్, బ్యానర్స్, లైటర్స్, కాయిన్స్, తిండి పదార్థాలు, ఫర్ ఫ్యూమ్స్‌కు అనుమతి లేదు. జాతీయ జెండాలు తప్ప ఇతర ఎలాంటి జెండాలను అనుమతించరు. మహిళల భద్రత దృష్టిలో ఉంచుకొని స్టేడియం లోపల షీం టీమ్స్ ఉంటాయి. స్టేడియం మొత్తం సీసీ కెమెరాల ఆధీనంలో ఉంటుంది. తక్షణ వైద్య సేవల కోసం 3 -8 అంబులెన్స్‌లు, 4-5 ఫైరింజన్లను అందుబాటులో ఉంచారు. మ్యాచ్ నేపథ్యంలో ప్రేక్షకులకు ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్‌లో ఇవాళ రాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి.

First published: December 6, 2019, 6:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading