Home /News /sports /

INDIA VS WEST INDIES SECOND ODI LIVE SCORE UPDATES AHMEDABAD NARENDRA MODI STADIUM TEAM INDIA SETS FIGHTING TOTAL ON BOARD SRD

Ind vs WI 2nd ODI : రాణించిన సూర్య, కేఎల్ రాహుల్.. విండీస్ ముందు ఫైటింగ్ టోటల్..

Ind vs WI 2nd ODI

Ind vs WI 2nd ODI

Ind vs WI 2nd ODI : ఈ మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ప్రయోగం చేశాడు. రెగ్యులర్ ఓపెనర్‌ రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను బరిలోకి దింపాడు. రోహిత్ శర్మ నిర్ణయం ఆశ్చర్యం కల్గించింది. వన్డేలలో రిషబ్ పంత్ ఓపెనర్‌గా రావడం ఇదే మొదటిసారి.

ఇంకా చదవండి ...
    అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డే (Ind vs WI 2nd ODI) లో టీమిండియా (Team India) బ్యాటర్లు తడబడ్డారు. విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ ( 83 బంతుల్లో 64 పరుగులు.. 4 ఫోర్లు ), కేఎల్ రాహుల్ ( 48 బంతుల్లో 49 పరుగులు.. 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (25 బంతుల్లో 29 పరుగులు.. 2 ఫోర్లు ) రాణించారు. విండీస్ బౌలర్లలో ఓడియన్ స్మిత్, అల్జెరీ జోసెఫ్ చెరో రెండు వికెట్లు తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఫస్ట్ మ్యాచులో 60 పరుగులతో ఆకట్టుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ సారి భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. ఐదు పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. కీమర్ రోచ్ బౌలింగ్ లో షై హోప్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అయితే, ఈ మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ప్రయోగం చేశాడు. రెగ్యులర్ ఓపెనర్‌ రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను బరిలోకి దింపాడు.

    రోహిత్ శర్మ నిర్ణయం ఆశ్చర్యం కల్గించింది. వన్డేలలో రిషబ్ పంత్ ఓపెనర్‌గా రావడం ఇదే మొదటిసారి. అయితే ఓపెనర్‌గా వచ్చిన పంత్ మాత్రం నిరాశపరిచాడు. ఓడియన్ స్మిత్ వేసిన 12వ ఓవర్ మొదటి బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. 34 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 18 పరుగులు మాత్రమే చేశాడు. మరి మూడో వన్డేలో పంత్ ఓపెనర్‌గా వస్తాడో లేదో చూడాలి. ఇక, స్వదేశంలో 100 వ వన్డే ఆడుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపర్చాడు. 18 పరుగులు చేసిన కోహ్లీ స్మిత్ బౌలింగ్ లోనే కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


    అయితే.. నాలుగో వికెట్ కు సూర్యకుమార్ యాదవ్ , కేఎల్ రాహుల్ 91 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. అయితే కీలక సమయంలో రాహుల్.. అనవసర పరుగు కోసం పరిగెత్తి రనౌట్ గా వెనుదిరిగాడు. ఈజీగా రెండు పరుగులు తీయాల్సిన చోట నిర్లక్ష్యంగా వ్యవహరించి భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు 43 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. అయితే, హాఫ్ సెంచరీ చేసి ఊపు మీదున్న సూర్య 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫాబియెన్ అలెన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

    ఆ తర్వాత కాసేపటికే.. 24 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ అకిల్ హుస్సేన్ బౌలింగ్ లో బౌండరీ మీద క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మెరుపులు మెరిపిస్తాడనుకున్న శార్దూల్ కూడా 8 పరుగులతో నిరాశపర్చాడు. ఆఖర్లో దీపక్ హుడాకు మరో ఎండ్ నుంచి సహకారం కరువైంది. సిరాజ్ (3 పరుగులు) కూడా నిరాశపర్చాడు. ఆఖర్లో జాసన్ హోల్డర్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు దీపక్ హుడా. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IND vs WI, India Vs Westindies, KL Rahul, Rohit sharma, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు