India vs West Indies | కోహ్లీ స్థానానికి రోహిత్ శర్మ ఎసరు...కొత్త రికార్డుకు కొద్ది అడుగులే దూరం...

ఈ ఏడాది మూడు క్రికెట్ ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 2,183 పరుగులు చేశాడు. అతడి తర్వాతి స్థానాల్లో రోహిత్‌ 2,090 పరుగులు, పాక్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌ 1,820 పరుగులు చేసి తరువాతి స్థానాల్లో ఉన్నారు.

news18-telugu
Updated: December 6, 2019, 5:31 PM IST
India vs West Indies | కోహ్లీ స్థానానికి రోహిత్ శర్మ ఎసరు...కొత్త రికార్డుకు కొద్ది అడుగులే దూరం...
రోహిత్ శర్మ (File)
  • Share this:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానానికి రోహిత్ శర్మ ఎసరు పెట్టేశాడు. ఇఫ్పటికే ఎసరు పెట్టేశాడు. గడిచిన మూడేళ్లుగా ఏడాదిలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలుస్తున్న విరాట్‌ కోహ్లీ నిలవగా, ప్రస్తుతం రోహిత్‌శర్మ ఆ స్థానానికి ఎగబాకుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది మూడు క్రికెట్ ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 2,183 పరుగులు చేశాడు. అతడి తర్వాతి స్థానాల్లో రోహిత్‌ 2,090 పరుగులు, పాక్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌ 1,820 పరుగులు చేసి తరువాతి స్థానాల్లో ఉన్నారు. అయితే కోహ్లీ కంటే రోహిత్ శర్మ 93 పరుగుల మాత్రమే వెనుకబడి ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ డిసెంబర్‌ నెలలో టీమిండియా మరో ఆరు మ్యాచులు మాత్రమే ఆడేందుకు అవకాశం ఉంది. ఈ ఆరు మ్యాచుల్లోగా రోహిత్ మొదటి స్థానంలో ఉన్న కోహ్లీని అధిగమించాల్సి ఉంది.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>