Shravan Kumar BommakantiShravan Kumar Bommakanti
|
news18-telugu
Updated: August 26, 2019, 6:49 AM IST
ప్రతీకాత్మక చిత్రం
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఘనంగా బోణీ చేసింది. తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను 318 పరుగుల తేడాతో ఓడించింది. రహానె (102) సెంచరీతోపాటు బుమ్రా విజృంభించడంతో విక్టరీ టీమిండియా వశమైంది. భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇది నాలుగో భారీ విజయం. టీమిండియా నిర్దేశించిన 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 26.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా (5/7) విజృంభించగా.. ఇషాంత్ (3/31), షమి (2/13) కూడా విండీస్ బ్యాట్స్‌మెన్ వెన్ను విరిచారు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రహానెకు తోడు హనుమ విహారి(93) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారీ లక్ష్య ఛేదనలో విండీస్ బుమ్రా దెబ్బకు వణికింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్(5 వికెట్లు) విజృంభించగా.. ఈసారి బుమ్రా వంతైంది. కేవలం 7 పరుగులే ఇచ్చిన బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో విండీస్ పేక మేడలా కుప్ప కూలింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
August 26, 2019, 6:48 AM IST