రేపటి నుంచి విండీస్‌తో మూడు వన్డేల సిరీస్...గాయంతో భువీ దూరం...

గాయం కారణంగా మరోసారి భువనేశ్వర్ విశ్రాంతికి పరిమితం అయ్యాడు. భారత వన్డే జట్టులో ఇప్పటికే మహ్మద్ షమీ, దీపక్ చాహర్ రూపంలో ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే యువ బౌలర్ శార్ధుల్ ఠాకూర్‌, నవదీప్ షైనీలకు జట్టులో అవకాశం దక్కవచ్చునని అంటున్నారు.

news18-telugu
Updated: December 14, 2019, 11:17 PM IST
రేపటి నుంచి విండీస్‌తో మూడు వన్డేల సిరీస్...గాయంతో భువీ దూరం...
భారత జట్టు (File)
  • Share this:
రేపటి నుంచి విండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. ఈ వన్డే సిరీస్‌కి బౌలర్ భువనేశ్వర్ దూరం అయ్యారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయపడ్డాడు. అయితే అతని స్థానంలో శార్ధుల్ ఠాకూర్‌ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్డే ప్రపంచకప్ తర్వాత గాయం కారణంగా దాదాపు టీమిండియాకి దూరమైన భువనేశ్వర్ కుమార్ ఇటీవల మళ్లీ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే గాయం కారణంగా మరోసారి భువనేశ్వర్ విశ్రాంతికి పరిమితం అయ్యాడు. భారత వన్డే జట్టులో ఇప్పటికే మహ్మద్ షమీ, దీపక్ చాహర్ రూపంలో ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే యువ బౌలర్ శార్ధుల్ ఠాకూర్‌, నవదీప్ షైనీలకు జట్టులో అవకాశం దక్కవచ్చునని అంటున్నారు. భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం చెన్నై వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇక రెండో వన్డే బుధవారం విశాఖపట్నంలో, మూడో వన్డే కటక్‌లో ఈ నెల 22న జరగనుంది.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>