Ind vs WI : నేడు భారత్, వెస్టిండీస్ తొలి వన్డే... పరుగుల వరద ఖాయం...

India vs West Indies ODI : వెస్టిండీస్‌తో మూడు టీ 20ల్లో విజయంతో దూకుడుమీదున్న టీమ్ఇండియా... ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉండటంతో... తొలి వన్డేలో రన్ రేటు పెరిగే అవకాశాలున్నాయి. రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవ్వనుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 8, 2019, 6:03 AM IST
Ind vs WI : నేడు భారత్, వెస్టిండీస్ తొలి వన్డే... పరుగుల వరద ఖాయం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
India vs West Indies ODI : కరీబియన్ జట్టుపై టీమ్ఇండియా టీ-ట్వంటీ సిరీస్ గెలవడంపై క్రికెట్ అభిమానులు పెద్దగా ఆశ్చర్యపోవట్లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ప్రధానంగా కోహ్లీ సేన ప్రస్తుతం దూకుడు మీద ఉండటమే. ఐతే, ఇదే జట్టు... వరల్డ్ కప్‌లో ఇలాగే దూకుడుగా ఉండి కూడా... న్యూజిలాండ్ చేతిలో ఓడి... సెమీస్ చేజార్చుకుంది. అందువల్ల ఇవాళ మొదలయ్యే వన్డే సిరీస్‌లో ఎలా ముందుకెళ్తుందన్నది ఆసక్తి రేపుతోంది. శిఖర్ ధావన్ రాకతో... జట్టుకు బలం పెంచుకున్న టీమ్... వన్డే సిరీస్‌ని కూడా క్లీన్ స్వీప్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకుంది. ఐతే... వెస్టిండీస్ కూడా క్రిస్ గేల్ చేరికతో బలంగా ఉంది. పైగా ఇదే తన చివరి వన్డే సిరీస్ అని గేల్ ప్రకటించాడు. అందుకే ఆ జట్టు... టీ-ట్వంటీ పోయినా... వన్డే సిరీస్ వదులుకునే ప్రసక్తే లేదంటోంది. ఈ సిరీస్‌ గెలిచి... గేల్‌కు ఘనంగా గుడ్ బై చెప్పాలనుకుంటోంది.

ఇవాళ్టి మ్యాచ్‌లో రోహిత్‌ శర్మతో కలిసి శిఖర్ ధవన్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టబోతున్నాడు. వరల్డ్ కప్‌లో చేతి వేలికి గాయమై... ధవన్ టీ-ట్వంటీ సిరీస్‌కి దూరమయ్యాడు. అతనికి భాగస్వామ్యంగా... వరల్డ్ కప్‌లో ఐదు సెంచరీలు చేసిన రోహిత్... ఉండటంతో... టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ ఇప్పుడు బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక తన కెప్టెన్సీపై విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ... సెంచరీతో సమాధానం చెప్పాలని చూస్తున్నాడు. ఇక నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ ఎంటరవుతున్నాడు. కేదార్‌ జాదవ్‌ ఐదు లేదా ఆరో పొజిషన్‌లో రావచ్చు. పంత్ ఏ స్థానంలో వస్తాడన్నదాన్ని బట్టీ... కేదార్ ఎప్పుడొచ్చేదీ డిసైడవుతుంది.

టీమ్ ఇండియా జట్టు : రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కోహ్లీ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, మనీష్‌ పాండే/శ్రేయాస్‌ అయ్యర్‌, కుల్దీప్‌ యాదవ్‌, కేదార్‌ జాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌, జడేజా, షమి, నవ్‌దీప్‌ సైనీ, ఖలీల్‌ అహ్మద్‌, భువనేశ్వర్‌.

వెస్టిండీస్‌ జట్టు : క్రిస్‌ గేల్‌, ఎవిన్‌ లూయిస్‌/జాన్‌ క్యాంప్‌బెల్‌, జాసన్‌ హోల్డర్‌ (కెప్టెన్‌), షాయ్‌ హోప్‌ (కీపర్‌), పూరన్‌, హెట్‌మయెర్‌, కీమర్‌ రోచ్‌, ఫాబియన్‌ అలెన్‌, రోస్టన్‌ చేజ్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, షెల్డన్‌ కాట్రెల్‌, ఒషానె థాంప్సన్‌, కీమో పాల్‌.
Published by: Krishna Kumar N
First published: August 8, 2019, 6:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading