ముంబైలో చిత్తుగా ఓడిన విండీస్..టీ20 సిరీస్ గెలిచిన భారత్

241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 173 పరుగులు మాత్రమే చేసింది.


Updated: December 11, 2019, 11:00 PM IST
ముంబైలో చిత్తుగా ఓడిన విండీస్..టీ20 సిరీస్ గెలిచిన భారత్
241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 173 పరుగులు మాత్రమే చేసింది.
  • Share this:
India vs West Indies: ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 67 పరుగుల తేడాతో కరీబియన్ జట్టుపై కొహ్లీ సేన సునాయసంగా గెలుపొందింది.  ఈ విక్టరీతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచింది.  241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు.. 20 ఓవర్లలో  8 వికెట్లు కోల్పోయి కేవలం 173 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య చేధనలో తడబడి ప్రారంభం నుంచే వరసగా వికెట్లు కోల్పోయింది కరీబియన్ జట్టు. కెప్టెన్ పొలార్డ్(68) , హెట్‌మెయిర్ (41) పోరాడినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు.

విండీస్ బ్యాట్స్‌మెన్‌లో పొలార్డ్, హెట్‌మైర్ తప్ప ఇంకెవరూ చెప్పుకోదగ్గర స్కోర్ సాధించలేదు. సిమన్స్ 7, కింగ్ 5, పూరన్ 0, హోల్డర్ 8, వాల్ష్ 11, పియర్ 6 పరుగులకు మాత్రమే పరిమితయ్యారు. విలియమ్స్ 13, కాట్రెల్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్, షమి, దీపక్ చాహర్, కుల్దీప్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (71), కేఎల్ రాహుల్ (91)తో పాటు కెప్టెన్ కొహ్లీ (70) మెరుపులు మెరిపించారు. వేగంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రోహిత్ శర్మ 34 బంతుల్లో 71 పరుగులు (5 సిక్స్‌లు, 6 ఫోర్లు) చేశాడు. కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 91 రన్స్ (4 సిక్స్‌లు, 9 ఫోర్లు) చేశాడు. రోహిత్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ కేవలం రెండు బంతులాడి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కొహ్లీ.. వస్తూనే విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లలతో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటాడు. మొత్తంగా 29 బంతుల్లో 70 రన్స్ (7 సిక్స్‌లు, 4 ఫోర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు.

కాగా, టీ20ల్లో భారత్‌‌కు ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై 260 పరుగులు చేసింది టీమిండియా. 2016లో లాడర్‌హిల్‌లో వెస్టిండీస్‌పై 244 రన్స్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో 240 పరుగులు చేసి మరోసారి విండీస్‌పై భారీ స్కోర్ సాధించింది.
Published by: Shiva Kumar Addula
First published: December 11, 2019, 10:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading