కరీబియన్ బౌలర్లను ఉతికారేసిన భారత్.. విండీస్ లక్ష్యం 241

టీ20ల్లో భారత్‌‌కు ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై 260 పరుగులు చేసింది టీమిండియా. 2016లో లాడర్‌హిల్‌లో వెస్టిండీస్‌పై 244 రన్స్ చేసింది.

news18-telugu
Updated: December 11, 2019, 8:58 PM IST
కరీబియన్ బౌలర్లను ఉతికారేసిన భారత్..  విండీస్ లక్ష్యం 241
టీ20ల్లో భారత్‌‌కు ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై 260 పరుగులు చేసింది టీమిండియా. 2016లో లాడర్‌హిల్‌లో వెస్టిండీస్‌పై 244 రన్స్ చేసింది.
  • Share this:
India vs West Indies: ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (71), కేఎల్ రాహుల్ (91)తో పాటు కెప్టెన్ కొహ్లీ (70) మెరుపులు మెరిపించారు. వేగంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రోహిత్ శర్మ 34 బంతుల్లో 71 పరుగులు (5 సిక్స్‌లు, 6 ఫోర్లు) చేశాడు. కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 91 రన్స్ (4 సిక్స్‌లు, 9 ఫోర్లు) చేశాడు. రోహిత్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ కేవలం రెండు బంతులాడి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కొహ్లీ.. వస్తూనే విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లలతో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటాడు. మొత్తంగా 29 బంతుల్లో 70 రన్స్ (7 సిక్స్‌లు, 4 ఫోర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు.

కాగా, టీ20ల్లో భారత్‌‌కు ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై 260 పరుగులు చేసింది టీమిండియా. 2016లో లాడర్‌హిల్‌లో వెస్టిండీస్‌పై 244 రన్స్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో 240 పరుగులు చేసి మరోసారి విండీస్‌పై భారీ స్కోర్ సాధించింది.


First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>