India Vs West Indies: సిక్సర్లతో విరుచుకుపడుతున్న పోలార్డ్..నిలకడగా ఆడుతున్న విండీస్...

India Vs West Indies Live Score, 3rd T20I in Guyana: పొలార్డ్ ఏకంగా 4 సిక్సర్లు బాదడంతో వికెట్ల పతనానికి బ్రేక్ పడింది. 13 ఓవర్లకు విండీస్ స్కోరు 3 వికెట్లకు 80 పరుగులు దాటింది.

news18-telugu
Updated: August 6, 2019, 10:18 PM IST
India Vs West Indies: సిక్సర్లతో విరుచుకుపడుతున్న పోలార్డ్..నిలకడగా ఆడుతున్న విండీస్...
కోహ్లీ, చాహర్
  • Share this:
India Vs West Indies Live Score, 3rd T20I in Guyana: గుయానా వేదికగా జరుగుతున్న టీ-20 సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఆఖరి టీ-20లో మొదట బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ వరుస వికెట్ల పతనం తర్వాత నిలకడగా ఆడుతోంది. పొలార్డ్ ఏకంగా 4 సిక్సర్లు బాదడంతో వికెట్ల పతనానికి బ్రేక్ పడింది. 13 ఓవర్లకు విండీస్ స్కోరు 3 వికెట్లకు 80 పరుగులు దాటింది. ఇదిలా ఉంటే విండీస్ కేవలం 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.  మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. దీపక్ చాహర్ బౌలింగ్ లో రెండో ఓవర్లోనే సునీల్ నరైన్(2) ఔటయ్యాడు. ఆ తర్వాత 3వ ఓవర్లో మరో ఓపెనర్ ఎవిన్ లెవిస్(10) కూడా చాహర్ బౌలింగ్‌లోనే ఔటవ్వడం విశేషం. ఇక శిమ్రాన్ హెట్‌మెయిర్(1) కూడా చాహర్ కే వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో చాహర్ ఖాతాలో మూడు వికెట్లు పడ్డాయి.
Published by: Krishna Adithya
First published: August 6, 2019, 10:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading