India vs West Indies: టెన్షన్ మ్యాచులో కోహ్లీ సేన విక్టరీ...సిరీస్ గెలచుకున్న టీమిండియా...

చివరి వన్డేలో టీమిండియా విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచులో 316 పరుగుల భారీ లక్ష్యాన్ని 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించారు.

news18-telugu
Updated: December 22, 2019, 9:57 PM IST
India vs West Indies: టెన్షన్ మ్యాచులో కోహ్లీ సేన విక్టరీ...సిరీస్ గెలచుకున్న టీమిండియా...
India vs West Indies: టెన్షన్ మ్యాచులో కోహ్లీ సేన విక్టరీ...సిరీస్ గెలచుకున్న టీమిండియా...
  • Share this:
కటక్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచులో 316 పరుగుల భారీ లక్ష్యాన్ని 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించారు. కెప్టెన్ కోహ్లీ(85) ఒంటరి పోరుతో పాటు మ్యాచ్ విజయం సాధ్యమైంది.  ఒక దశలో మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ (7), రిషబ్ పంత్(7), కేదార్ జాదవ్(9) పరుగులతో వరుసగా ఔట్ కావడంతో పరుగుల భారం మొత్తం కెప్టెన్ కోహ్లీపై పడింది. ఇదిలా ఉంటే భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్‌లు నిలకడగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. 316 పరుగలు భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. లోకేశ్ రాహుల్ 53 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, రోహిత్ శర్మ 52 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీ చేశాడు. అయితే రోహిత్ శర్మ(63) 21వ ఓవర్లో జేసన్ హోల్డర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత 167 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (77) ఔటయ్యాడు. విండీస్ బౌలర్లలో కీమో పాల్ 2, కాట్రెల్, జేసన్ హోల్డర్, జోసెఫ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇదిలా ఉంటే విండీస్‌తో జరుగుతున్న ఫైనల్ వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 315/5 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్ నికొలస్ పూరన్(89), కెప్టెన్ కీరన్ పొలార్డ్ చెలరేగడంతో విండీస్ వేగంగా పరుగులు రాబట్టింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా, విండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేసింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (21), షాయ్ హోప్‌(42)లను 70 పరుగుల్లోపే ఔట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన విధ్వంసక బ్యాట్స్‌మెన్ హిట్మయిర్ (37) తక్కువ పరుగులకే ఔట్ అయ్యాడు.

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన నికోలస్ పూరన్ మాత్రం దంచికొట్టాడు. బౌలర్లను బెంబేలెత్తించి సెంచరీ ముంగిట అవుటయ్యాడు. 64 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 89 పరుగులు చేసిన పూరన్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కీరన్ పోలార్డ్ మాత్రం విండీస్ స్కోరును 300 దాటించాడు. 7 సిక్సర్లు, 3 బౌండరీలతో పొలార్డ్ 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో నవదీప్ సైనీ 2 వికెట్లు పడగొట్టగా, షార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమి, రవీంద్ర జడేజా చెరో వికెట్ చొప్పున పడగొట్టారు.

First published: December 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు