India vs West Indies: విండీస్ లక్ష్యం 171 పరుగులు...గెలిస్తే సిరీస్ టీమిండియాకే...

భారత్, వెస్టిండీస్‌ రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దీంతో విండీస్ విజయానికి 171 పరుగుల లక్ష్యం చేదించాల్సి ఉంది.

news18-telugu
Updated: December 8, 2019, 9:22 PM IST
India vs West Indies: విండీస్ లక్ష్యం 171 పరుగులు...గెలిస్తే సిరీస్ టీమిండియాకే...
(Image: BCCI)
  • Share this:
తిరువనంతరపురం వేదికగా జరుగుతున్న భారత్, వెస్టిండీస్‌ రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దీంతో విండీస్ విజయానికి 171 పరుగుల లక్ష్యం చేదించాల్సి ఉంది.   వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్‌కు కేఎల్ రాహుల్ (11) రూపంలో తొలి వికెట్ పడింది. ఆ తర్వాత రోహిత్ శర్మ కుదురుకునే ప్రయత్నం చేసినప్పటికీ 15 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివం దూబే మాత్రం సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. కేవలం 30 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. 97 పరుగుల వద్ద శివం దూబే మూడో వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్ భారం కోహ్లీపై పడింది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీఇండియా పట్టుదలతో ఉంది. మరోవైపు భారత్‌ను ప్రతిఘటించి సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పొలార్డ్‌ సేన ఉవ్విళ్లూరుతోంది. తుది జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజు శాంసన్‌కు మరోసారి నిరాశే మిగిలింది. తొలి టీ20లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో కోహ్లీసేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
Published by: Krishna Adithya
First published: December 8, 2019, 9:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading