India vs West Indies: విండీస్ చేతిలో భారత్ ఘోర ఓటమి...కోహ్లీ సేనకు షాక్

భారత్, వెస్టిండీస్‌ రెండో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దీంతో విండీస్ విజయానికి 171 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

news18-telugu
Updated: December 9, 2019, 9:28 AM IST
India vs West Indies: విండీస్ చేతిలో భారత్ ఘోర ఓటమి...కోహ్లీ సేనకు షాక్
(Image: BCCI)
  • Share this:

  1. తిరువనంతరపురం వేదికగా జరుగుతున్న భారత్, వెస్టిండీస్‌ రెండో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దీంతో విండీస్ విజయానికి 171 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. కాగా భారత్ నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ దూకుడుగా ఆడింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్(40), సిమ్మన్స్ (67) సైతం సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో విండీస్ 18.3 ఓవర్లలో 173/2 పరుగులు చేసింది.



ఇదిలా ఉంటే తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్‌కు కేఎల్ రాహుల్ (11) రూపంలో తొలి వికెట్ పడింది. ఆ తర్వాత రోహిత్ శర్మ కుదురుకునే ప్రయత్నం చేసినప్పటికీ 15 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివం దూబే మాత్రం సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. కేవలం 30 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>