India vs West Indies: కోహ్లీ ఔట్...రాణించిన దూబే...వికెట్ల వేటలో విండీస్

తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్‌కు కేఎల్ రాహుల్ (11) రూపంలో తొలి వికెట్ పడింది. ఆ తర్వాత రోహిత్ శర్మ కుదురుకునే ప్రయత్నం చేసినప్పటికీ 15 పరుగులకే ఔట్ అయ్యాడు.

news18-telugu
Updated: December 8, 2019, 8:15 PM IST
India vs West Indies: కోహ్లీ ఔట్...రాణించిన దూబే...వికెట్ల వేటలో విండీస్
శివం దూబే (Image: BCCI)
  • Share this:
తిరువనంతరపురం వేదికగా జరుగుతున్న భారత్, వెస్టిండీస్‌ రెండో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్‌కు కేఎల్ రాహుల్ (11) రూపంలో తొలి వికెట్ పడింది. ఆ తర్వాత రోహిత్ శర్మ కుదురుకునే ప్రయత్నం చేసినప్పటికీ 15 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివం దూబే మాత్రం సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. కేవలం 30 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. 97 పరుగుల వద్ద శివం దూబే మూడో వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్ భారం కోహ్లీపై పడింది. కోహ్లీ సైతం 19 పరుగులకే వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీఇండియా పట్టుదలతో ఉంది. మరోవైపు భారత్‌ను ప్రతిఘటించి సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పొలార్డ్‌ సేన ఉవ్విళ్లూరుతోంది. తుది జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజు శాంసన్‌కు మరోసారి నిరాశే మిగిలింది. తొలి టీ20లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 సిరీస్‌లో కోహ్లీసేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
Published by: Krishna Adithya
First published: December 8, 2019, 8:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading